ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థి తూముల
బొబ్బిలి, సూర్య : బొబ్బిలి మున్సిపాలిటీ 14 వ వార్డు లో బొబ్బిలి లక్ష్మి అధ్యక్షతన బొబ్బిలి పుర ప్రజలను మరయు వైసీపీ కుటుంబ సభ్యులను చైర్మన్ అభ్యర్థి తూముల అచ్చుతవల్లి ఆత్మీయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో మరి కొద్ది రోజుల్లో జరగబోతున్న ఎన్నికలలో వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తూముల అచ్చుతావల్లి కి ఒక ఓటు మరయు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థికి ఒక ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరారు.
రిపోర్టర్ : సింహాచలం రెడ్డి, బొబ్బిలి, విజయనగరం జిల్లా.