మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసిన మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం
పటాన్‌చెరు:పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహను మర్యాదపూర్వకంగా కలిశారు. దసరా పండుగను పురస్కరించుకొని మంత్రికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ అభివృద్ధి, రైతులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు సంబంధించిన అంశాలపై చర్చించారు. వ్యవసాయ మార్కెట్‌కు వచ్చే రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, మార్కెట్‌ను మరింత అభివృద్ధి చేయడం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.మార్కెట కమిటీ అభివృద్ధితో పాటు రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఏపూరి శివానందం అన్నారు. రైతులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహతో ఆత్మీయంగా మాట్లాడారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.