31వ డివిజన్ లో ప్రచారంలో దూసుకుపోతున్న మందపాటి భానుప్రియ
తిరుపతి, మేజర్ న్యూస్:
నగరపాలక సంస్థ పరిధిలోని 31 వ డివిజన్ లో జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ ప్రచారంలో దూసుకుపోతున్నారు. భానుప్రియ ప్రచారంలో టిడిపి బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొని ఆమె గెలుపు కోసం ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే 31 డివిజన్ పరిధిలోని అన్ని వీధులలో ఒక గఫా ప్రచారాన్ని పూర్తి చేసుకున్నారు. డివిజన్ పరిధిలో ఎవరి నోట విన్న మందపాటి భానుప్రియ గాజు గ్లాస్ గుర్తుకే ఓటేసి గెలిపించాలని పలుకుతున్నారు. మీ అందరికీ అందుబాటులో ఉండి ఒక సోదరిగా, మీ ఇంటి అడ్డుపడుచు గా అభివృద్ధి చేస్తానని, ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ప్రజా సంక్షేమము అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దూసుకుపోతోందని, ఇప్పటికే ఇచ్చిన హామీలను 98 శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వం దేనని చెప్పారు. తనను కార్పొరేటర్ గా గెలిపిస్తే రానున్న రోజుల్లో డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంతో పాటు అర్హులైన వారందరికీ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించేలా చొరవ చూపుతానని ఓటర్లకు, డివిజన్ లోని ప్రజలకు హామీ ఇచ్చారు. జనసేన నాయకుడు సతీష్ యాదవ్, మధుసూదన్, రేఖ, గోవిందా చారి, మధు ఆచారి, సురేష్, రాజేష్, విజయలక్ష్మి, ఉదయగిరి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
H. Dwaraka, staff reporter.
Cell no : 9705347341