బొబ్బిలిలో ఎంపీటీసీ నామినేషన్ల స్క్రూటినీ
బొబ్బిలి, సూర్య : బొబ్బిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల స్క్రూటినీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ మేరకు ఎన్నికల అధికారి ఆర్. మురళీనాథ్ ఆధ్వర్యంలో సిబ్బంది ప్రతి అభ్యర్థి నామినేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ప్రక్రియ నేడు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. అనంతరం అర్హులైన అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటించనున్నారు. అలాగే ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు అక్టోబర్ 27 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. పోలింగ్ తేదీ నవంబర్ 3, ఫలితాల విడుదల: నవంబర్ 5 ఉంటుంది అని చెప్పారు. అలాగే 86 నామినేషన్ లు దాఖలు అయ్యాయని తెలిపారు. వీటిలో వైఎస్సార్ సీపీ నుంచి 43, టిడిపి 49, బిజెపి 2, జనసేన 1 నామినేషన్ లు ఉన్నాయని తెలిపారు.
రిపోర్టర్ : సింహాచలం రెడ్డి, బొబ్బిలి, విజయనగరం జిల్లా.