BREAKING
బాలీవుడ్‌పై నటుడు మనోజ్ బాజ్‌పాయ్ సంచలన వ్యాఖ్యలు: ఇండస్ట్రీలో పరిస్థితులపై తీవ్ర అసంతృప్తి కంబలపల్లి పైలెట్ గ్రామంగా ఎంపిక ఇంకుడు గుంతల నిర్మాణానికి శంకుస్థాపన భైరాపూర్ చెరువులో మునిగి వ్యక్తి మృతి కెరెల్లి గ్రామంలో విద్యుత్ సమస్య పరిష్కారానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాలు ఓటీటీలో ఆకట్టుకుంటున్న తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ 'ఫైట్ మహా': మస్ట్ వాచ్ సస్పెన్స్ మూవీ మోమిన్‌పేట్ రైతు వేదికలో ఎల్‌నినో ప్రభావంపై సమీక్ష.. వీక్షించిన రైతులు టీఎన్జీవో సభ్యత్వ నమోదులో 55 మంది ఉద్యోగులు పి.ఎం. రహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స - రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు 21 వార్డులో టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి రాజశేఖర్ ప్రచారం జోరు ఇంకొల్లు మండలంలో 67 నామినేషన్లు ఆమోదం సాయిపూర్‌లో ఆంజనేయ స్వామి ఉత్సవం అంగరంగ వైభవం 11వ వార్డు లో జోరుగా ఎన్నికల ప్రచారం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కలను సాకారం చేస్తాం : సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయోడిన్ పై విద్యార్థులకు అవగాహన భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి - రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు

ఏడు కీలక సూచికల్లో బాడంగి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు ముందంజ

Select Suryaa Now
ఏడు కీలక సూచికల్లో బాడంగి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు ముందంజ

బాడంగి, సూర్య : బాడంగి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయాన్ని శనివారం ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.వి. బాలామణి, నోడల్‌ అధికారి బి. తవిటినాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీడీపీఓ ఎల్‌. సుజాత, సూపర్‌వైజర్లు ఎస్‌.కె. గౌరమ్మ, వై.వి. నాగమణి, ఎ. శ్రీదేవి, కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం తప్పనిసరిగా అందించాలని, విధుల్లో సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఏడు కీలక పనితీరు సూచికల్లో బాడంగి ప్రాజెక్టు ముందంజలో ఉండటంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. కార్యాలయ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు.

రిపోర్టర్ : శ్రీనివాసరావు, బాడంగి, విజయనగరం జిల్లా.