BREAKING
కరువు ముప్పు పొంచి ఉన్నా.. కొత్త బోర్లకు అడ్డుకట్టేది ఎవరు? జోరుగా ఆరు పిక్కల జూదం!. - * ‘సింగిల్ మాది.. డబుల్ మీది’ పేరుతో దందా * అనాథ వృద్ధులకు బాలవికాస అండ 40 మంది వృద్ధులకు నిత్యావసర సరుకులు, సమస్యాత్మక గ్రామాలు గుర్తించి అధికారులు అప్రమత్తంగా ఉండాలి తిరుపతిలో టీడీపీకి తిరుగులేదు జేబీ శ్రీనివాస్‌కు కమ్మ సంఘం మద్దతు 66 డివిజన్లలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం విద్యార్థి హక్కుల పోరాటానికి బీఆర్ఎస్వీ బలోపేతం -బండచర్లపల్లి,రావురూకులలో నూతన విద్యార్థి కమిటీల ఏర్పాటు నటి ఇంద్రజ చేతుల మీదుగా ‘జుఒన్‌’ సూపర్‌ యాప్‌ ఆవిష్కరణ.. ఒకే వేదికపై 25 రకాల సేవలు! ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు మృత కార్మికుల కుటుంబాలకు యూనియన్ అండ.. -రూ.20 వేల సాయం! తుఫాను నేపథ్యంలో రైతులు అప్రమత్తత అవసరం * సూచనలు అందజేసిన మండల ఏవో మెట్ట మోహనరావు * అభివృద్ధి, సంక్షేమమే ప్రచార అస్త్రాలుగా ముందుకు సాగుదాం ... ఏకగ్రీవ ఎన్నిక ధ్రువపత్రం అందుకున్న సురేష్ నాయుడు స్థానిక సంస్థల జోరు.. రెబల్స్ తో పోరు సైకిల్ గుర్తుకే ఓటు వేయండి.. జడ్పిటిసి అభ్యర్థి శిరీష హడ్కో కాలనీలో వైఎస్సార్‌సీపీ ప్రచార జోరు

ఖాదీ మేళాకు శ్రీకారం -  సింగరేణి ఉద్యోగులకు ప్రత్యేక క్రెడిట్‌ సౌకర్యం

Select Suryaa Now
ఖాదీ మేళాకు శ్రీకారం -  సింగరేణి ఉద్యోగులకు ప్రత్యేక క్రెడిట్‌ సౌకర్యం

సూర్య నస్పూర్‌ : స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడంతోపాటు చేనేత కార్మికులకు అండగా నిలవాలని శ్రీరాంపూర్‌ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్‌ కోరారు. నస్పూర్‌ కాలనీలోని మనోరంజన్‌ సముదాయ్‌లో వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్‌ ప్రతిష్ఠాన్‌ (గోదావరిఖని) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఖాదీ మేళాను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖాదీ వస్త్రాలపై 30 శాతం, పొందూరు ఖాదీ, కోసా సిల్క్‌, ఉన్ని వస్త్రాలపై 20 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు మేళా కొనసాగుతుందని పేర్కొన్నారు. మేళాలో ఖాదీ వస్త్రాలు, టవల్స్‌, బెడ్‌షీట్లు, కలంకారీ వస్త్రాలు, లుంగీలు, స్టార్‌ కార్పెట్లతోపాటు స్వచ్ఛమైన తేనె, కుటీర్‌ సబ్బులు, అగరబత్తులు, జీవశక్తి టానిక్‌, స్టీవియా పౌడర్‌ తదితర గ్రామోద్యోగ ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. సింగరేణి ఉద్యోగులకు రూ.20 వేల వరకు ఖాదీ వస్త్రాలను క్రెడిట్‌పై కొనుగోలు చేసే అవకాశం కల్పించామని జీఎం తెలిపారు. ఈ మొత్తాన్ని ఉద్యోగుల జీతాల నుంచి ఐదు సులభ వాయిదాల్లో చెల్లించవచ్చని వివరించారు. ఉద్యోగులు, స్థానికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఖాదీ ఉత్పత్తుల కొనుగోళ్లతో చేనేత, చేతివృత్తులపై ఆధారపడిన కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్‌) ఎస్‌.అనిల్‌ కుమార్‌, డీవైపీఎం కె.క్రాంతి కుమార్‌, ఖాదీ మేళా నిర్వాహకులు రాజేష్‌, రామ్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.