సప్తధాన్య కషాయంపై అవగాహన
బాడంగి, సూర్య : బాడంగి గ్రామంలో రైతులు కె. అప్పలస్వామి, స్వాతి పొలాల్లో శనివారం సప్తధాన్య కషాయాన్ని తయారు చేసే విధానాన్ని ప్రదర్శించారు. ఏడు రకాల పప్పు ధాన్యాలను మొలకెత్తించి, ఆవు మూత్రంతో కలిపి తయారు చేసే ఈ ద్రావణాన్ని వరి పంటకు పిచికారీ చేయడం వల్ల గింజల నాణ్యత, రంగు, దిగుబడి మెరుగుపడతాయని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఎఫ్‌ఎంటీ వై. సత్యనారాయణ రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీఆర్‌పీ రామలక్ష్మి, రైతులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : శ్రీనివాసరావు, బాడంగి, విజయనగరం జిల్లా.