andhrapradesh
వృత్తి నైపుణ్యాలతో స్వయం ఉపాధికి బాటలు – ప్రిన్సిపాల్ డాక్టర్ సుజాత
అవనిగడ్డ, మేజర్ న్యూస్: సాధారణ విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలను నేర్పించడం ద్వారా విద్యార్థులు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుజాత అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీఎం ఉషా పథకం కింద 15 రోజుల పాటు నిర్వహించిన మొబైల్ రిపేర్ శిక్షణను పూర్తి చేసుకున్న 60 మంది విద్యార్థులకు శనివారం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.మొవ్వ వి.ఎస్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ఆధ్వర్యంలో అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భాగస్వామ్యంతో యాక్సిస్‌పాయింట్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సహకారంతో ఈ శిక్షణ నిర్వహించారు. మొబైల్ ఫోన్లలోని లోపాలను గుర్తించడం, మరమ్మతులు చేయడం, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ సమస్యలను పరిష్కరించడం వంటి అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మొవ్వ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమారాణి హాజరై విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. మొబైల్ రిపేర్ శిక్షకుడు మాధవరావు, కళాశాల సిబ్బంది మంజుల, అంకారావు, అయ్యప్ప, స్వర్ణజ్యోతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.