అభివృద్ధిని గెలిపించండి - 28వ వార్డులో కోటి 14 లక్షలతో అభివృద్ధి పనులు - ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదేశాల మేరకు ప్రచారం జోరు - మేయర్ అభ్యర్థి కటారి హేమలత గెలుపు కోసం కార్పొరేటర్ అభ్యర్థి తేజశ్రీ పచ్చప్ప విస్తృత ప్రచారం
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:చిత్తూరు నగరంలోని 28వ వార్డులో గత రెండున్నరేళ్లలో చిత్తూరు అభివృద్ధిలో భాగంగా సుమారు 1 కోటి 14 లక్షల వ్యయంతో తేనెబండలో అభివృద్ధి పనులు జరిగాయని, అభివృద్ధిని గెలిపించాలని కోరుతూ 28వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి టి. తేజశ్రీ పచ్చప్ప విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదేశాల మేరకు చిత్తూరు తెదేపా మేయర్ అభ్యర్థి కటారి హేమలత గెలుపు కోసం 28వ వార్డులో తేజశ్రీ పచ్చప్ప ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు.28వ వార్డు తేనెబండలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు, మంచినీటి బోర్ల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆధ్వర్యంలో జరిగాయని వార్డు ప్రజలకు వివరిస్తున్నారు.మన వార్డు.. మన అభివృద్ధి.. సైకిల్ గుర్తుకు ఓటు వేద్దాం.. మన వార్డు అభివృద్ధిని సాధిద్దాం అంటూ ప్రచారం సాగిస్తున్నారు. మేయర్ గా కటారి హేమలతను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు.ఈ ప్రచారంలో తెదేపా ప్రధాన కార్యదర్శి, తేజశ్రీ భర్త పచ్చప్పతో పాటు వార్డు నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్ లవ కుమార్