బి-ఫామ్ సమర్పించిన గుండె హరీష.. గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అడుగులు!
టి. నర్సాపురం,మేజర్ న్యూస్:పోలవరం నియోజకవర్గం టి. నర్సాపురం మండల జడ్పీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచిన గుండె హరీష నామినేషన్ స్క్రూటినీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. పార్టీ తరఫున పోటీ చేసేందుకు అవసరమైన బి-ఫామ్‌ను పోలవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్‌చార్జి తెల్లం బాలరాజు ద్వారా సమర్పించారు.గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ శ్రేణులుఈ విషయాన్ని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు వాసిరెడ్డి మధు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టి. నర్సాపురం మండల ప్రజలు గుండె హరీషకు తమ అమూల్యమైన ఓటు వేసి ఆదరించాలని కోరారు. ప్రజల మద్దతుతో జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకునే లక్ష్యంతో పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నాయని తెలిపారు.బి-ఫామ్ సమర్పణతో అభ్యర్థిత్వానికి సంబంధించిన కీలక ప్రక్రియ పూర్తయిందని, ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
పసుమర్తి రాము జిల్లా ఇంచార్జ్ ఏలూరు