BREAKING
ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ కె. రాజా రెడ్డి మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే దంపతులు కుటుంబానికి పరామర్శ. ఓటర్లందరికీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు - కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి వై.ఓ నందన్ 16 డివిజన్ కార్పొరేటర్ గా గెలిపించండి... ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతా... టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి నాగభూషణం ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ప్రారంభించిన ఎస్పీ ఎన్ ఎల్ ఎస్ ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా కానాల కూటమి అభ్యర్థుల గెలుపుకై ఎమ్మెల్యే బీవీ విస్తృత ప్రచారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థులు హరీష్ రావుకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఇంద్రేశం చైర్మన్ ప్రమీల,కౌన్సిలర్ అంతిరెడ్డి భూముల రీ-సర్వే పకడ్బందీగా నిర్వహించాలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వైకాపా ఎస్సీ సెల్ నేత నన్నం జస్టిస్. 53వ డివిజన్ ప్రచారంలో జోరుగా దూసుకుపోతున్న శంకర్ యాదవ్ విక్రమ సింహపురి యూనివర్సిటీ అంతర కళాశాలలో ఆటలపోటీలు నిర్వహించారు. లే అవుట్ లను పరిశీలించిన కమిషనర్ కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు హరీష్ రావుకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ఇస్నాపూర్ చైర్మన్ మోటే సుమలత శ్రీకాంత్ దంపతులు

రూ.750 కోట్లతో భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

Select Suryaa Now
రూ.750 కోట్లతో భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి :- మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపిస్తే నగరంలో రూ.750 కోట్లతో భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు తీసుకొస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హామీ ఇచ్చారు. శనివారం వర్షంలోనూ నవోదయ కాలనీ, బుడ్డప్ప నగర్, మరువకొమ్మ కాలనీతో పాటు 23, 25, 26, 27, 28, 29 డివిజన్లలో ప్రచారం నిర్వహించి కూటమి అభ్యర్థులకు మద్దతు కోరారు.టీడీపీ, జనసేన అభ్యర్థులు సోనియా, కాలేషాతో పాటు అలివేలమ్మ, సరస్వతి, రామేశ్వరి, రాజేశ్వరితో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. నగరంలో ఇప్పటికే కోట్లాది రూపాయలతో రోడ్లు, డ్రైన్లు నిర్మించామని, రూ.1,400 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. భూగర్భ డ్రైనేజీకి రూ.750 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేసి కేంద్రానికి పంపామన్నారు. రాబోయే రెండున్నరేళ్లలో పెండింగ్ పనులు పూర్తి చేసి పార్కులు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతోందన్నారు. ఎన్డీఏ మేయర్ అభ్యర్థి అజేష్‌తో పాటు కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గడ్డం సుబ్రహ్మణ్యం, జయరాం నాయుడు, సుధాకర్ యాదవ్, ఫిరోజ్ అహ్మద్, సాకే లక్ష్మీనరసింహ, తొండపునాటి రమేష్, రంగాచారి, బాలాంజనేయులు, కట్టుబడి బాబాజీ, మంజుల, సరోజమ్మ, పుల్లన్న తదితరులు పాల్గొన్నారు.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్