BREAKING
ప్రియదర్శినికి డాక్టరేట్ ప్రదానం గ్రామీణ ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలు -కూచుకుళ్ల రామచంద్రారెడ్డి ఐ సెంటర్ 28వ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, -మారుమూల ప్రాంతాల్లో నేత్ర వైద్య సేవలు అందించడం అభినందనీయం, జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అగ్నిప్రమాదంలో దెబ్బతిన్న చర్చి పునర్నిర్మాణానికి కృషి చేస్తా.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హామీ వృత్తి నైపుణ్యాలతో స్వయం ఉపాధికి బాటలు – ప్రిన్సిపాల్ డాక్టర్ సుజాత గడువులోగా ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయాలి.. ఆస్తులు కోల్పోయిన వారికి వారంలో పరిహారం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చీరాలలో ఆమంచి ఎన్నికల ప్రచారం.. 5, 6వ వార్డుల్లో పర్యటన! ఆదరించండి అండగా నిలుస్తా.... -56వ డివిజన్ ప్రచారంలో బ్యాంకు శాంతమ్మ అభివృద్ధిని గెలిపించండి - 28వ వార్డులో కోటి 14 లక్షలతో అభివృద్ధి పనులు - ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదేశాల మేరకు ప్రచారం జోరు - మేయర్ అభ్యర్థి కటారి హేమలత గెలుపు కోసం కార్పొరేటర్ అభ్యర్థి తేజశ్రీ పచ్చప్ప విస్తృత ప్రచారం బి-ఫామ్ సమర్పించిన గుండె హరీష.. గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అడుగులు! ఖమ్మం విజయ డైరీ ముందు బిజెపి ధర్నా --డి.డి కి వినతి పత్రం అందజేత --ఖమ్మం బిజెపి టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి-కొత్తపల్లి గోరి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నియామకాలు లేకుండానే కోట్ల చెల్లింపులా? బ్రిగేడ్ ఏజెన్సీపై విచారణకు కాంగ్రెస్ డిమాండ్ రూ.750 కోట్లతో భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కాలేశ్వరంపై కుట్ర పన్నింది సీఎం రేవంత్ రెడ్డి రోస్టర్ కేటాయింపులో మాలలకు తీవ్ర అన్యాయం

నాగపూర్ గ్రామంలో పల్లె నిద్ర..

Select Suryaa Now
నాగపూర్ గ్రామంలో పల్లె నిద్ర..

సూర్య కమ్మర్ పల్లి :నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు కమ్మర్‌పల్లి ఎస్‌ఐ శ్రీ సీహెచ్. సతీష్  నిన్న రాత్రి నాగపూర్ గ్రామంలో ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. గ్రామ ప్రజలతో మమేకమై, వారి సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, వివిధ సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలు, యువకులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించారు. అలాగే, పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.అదేవిధంగా, యువతలో చైతన్యం, ఉత్సాహం పెంపొందించేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని ఎస్‌ఐ సతీష్ సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పాలేపు నరసయ్య, గ్రామ సర్పంచ్ కె.అశోక్, ఉప సర్పంచ్, వీడీసీ అధ్యక్షుడు సభ్యులు, గ్రామ కార్యదర్శి, గ్రామ యువకులు, మహిళలు, గ్రామ ప్రజలు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.