BREAKING
బి-ఫామ్ సమర్పించిన గుండె హరీష.. గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అడుగులు! ఖమ్మం విజయ డైరీ ముందు బిజెపి ధర్నా --డి.డి కి వినతి పత్రం అందజేత --ఖమ్మం బిజెపి టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి-కొత్తపల్లి గోరి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నియామకాలు లేకుండానే కోట్ల చెల్లింపులా? బ్రిగేడ్ ఏజెన్సీపై విచారణకు కాంగ్రెస్ డిమాండ్ రూ.750 కోట్లతో భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కాలేశ్వరంపై కుట్ర పన్నింది సీఎం రేవంత్ రెడ్డి రోస్టర్ కేటాయింపులో మాలలకు తీవ్ర అన్యాయం జైత్వారం అంగన్వాడీ కేంద్రంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం చీరాలలో వైసీపీ చైర్మన్ అభ్యర్థి కారుపై దాడి వాల్మీకి జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవాలి -పుణ్యపురంలో ఉచిత మెగా వైద్య శిబిరం.. --ప్రజలకు వైద్య సేవలు అందించిన సర్పంచ్ మరియమ్మ --గ్రేస్ జనరల్ హాస్పిటల్ సహకారంతో నిర్వహణ. --ఉచితంగా బీపీ, షుగర్, కంటి పరీక్షలు.. --అవసరమైన వారికి మందుల పంపిణీ పట్టభద్రుల ఓటు నమోదుపై కాంగ్రెస్ దూకుడు --ఏడు గ్రామాల్లో ఓటరు నమోదు కేంద్రాలు.. --అర్హులైన ప్రతి పట్టభద్రుడూ ఓటరుగా నమోదు కావాలి: శీలం చంద్రశేఖర్ రెడ్డి ఓప్రా విన్‌ఫ్రే స్కాలర్‌షిప్ ఫండ్.. 30 ఏళ్లలో వందలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు -చందాలు వసూలు చేస్తున్నారు.. వైద్యం మాత్రం అందడం లేదు! --పీఆర్సీ కోసం ఎదురుచూపులు.. బకాయిల కోసం నిరీక్షణ.. --పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వానికి సంఘం సూటి ప్రశ్నలు ప్రజల్లోకి దూసుకెళ్తున్న టీడీపీ అభ్యర్థి కవిత మురళి

ప్రచారంలో దూసుకుపోతున్న మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి మొల్ల సాబేరున్నిసా...!

Select Suryaa Now
ప్రచారంలో దూసుకుపోతున్న మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి మొల్ల సాబేరున్నిసా...!

ప్రచారంలో దూసుకుపోతున్న మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి మొల్ల సాబేరున్నిసా...!
- ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత
- ఏబీఎం పాలెం లో ఇంటింటికి ఎమ్మెల్యే ప్రచారం
-  మొల్ల సాబేరున్నిసాకు 1వ వార్డులో బ్రహ్మరథం

నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్-: ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష పార్టీలకంటే పట్టణ ప్రజలను ఆకర్షిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పట్టణంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్ పర్సన్ అభ్యర్థి మొల్ల సాబేరున్నిసా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. శనివారం పట్టణంలోని ఏబీఎం పాలెం 1వ వార్డులో
 ఇంటింటికీ “చెప్పాం.. చేస్తున్నాం” అంటూ ఎన్నికల ప్రచారంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొన్నారు. ముందుగా నందికొట్కూరు కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మొల్ల సాబీరున్నిసా కి మరియు 1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కాటేపోగు శివకృష్ణ లకు వార్డు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థికి మరియు వార్డు అభ్యర్థికి
తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు పై రెండు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఇంటింటికి తిరిగి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ అవ్వ ..తాత మీ ఓటు మాకే అంటూ జెట్ స్పీడ్ పెంచారు. పట్టణాభివృద్ధి మరింత కొనసాగాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.నందికొట్కూరు పట్టణ అభివృద్ధికి మరింత బాటలు చేసేందుకు మా అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు లాయర్ జాకీర్, కాటేపోగు భాస్కర్, నిమ్మకాయల మోహన్, ముర్తు జావలి , తదితరులు పాల్గొన్నారు.