BREAKING
మల్కాపూర్‌ అసైన్డ్‌ భూములపై అంతుచిక్కని భూసేకరణ వ్యవహారం! మిత్రమా ఎలా ఉన్నావ్.. స్నేహం కోసం... 31 గిన్నస్ ప్రపంచ రికార్డులతో చరిత్ర సృష్టించిన గీతం పూర్వ విద్యార్థిని కేవలం రూ. 2.5 కోట్ల బడ్జెట్.. వంద కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద కన్నడ సినిమా సెన్సేషన్! కరువు మండలంగా ప్రకటించాలి తెలంగాణ రాష్ట్ర యూత్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పులిమామిడి రాజు ప్రజల నమ్మకాన్ని గెలిపిస్తాను. కౌన్సిలర్ రామయ్య. మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం 24వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అనాథ పిల్లలకు అన్నదానం రామ్ చరణ్, సుకుమార్ క్రేజీ కాంబో 'RC17' మూవీ లాంచ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే? మనోజ్ బాజ్ పాయ్ కొత్త సినిమా 'గజబ్ రాత్' రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? రైతు కష్టాలు మా కష్టాలే.. అన్నదాతకు ప్రభుత్వం అండగా ఉంటుంది నందికంది గ్రామాన్ని వణికిస్తున్న బ్లూక్రాఫ్ట్ ఆగ్రో కాలుష్యం! వైఎస్సార్‌సీపీ నాయకుడు జగన్ మోహన్‌రెడ్డి మృతికి కాటసాని సంతాపం ఎన్నికల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గొడవలకు ఆజ్యం పోసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు గొడశలపల్లి, కూడ్లూరు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించిన హీరేహాళ్ ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి ప్రత్యేక పూజలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు

-చందాలు వసూలు చేస్తున్నారు.. వైద్యం మాత్రం అందడం లేదు! --పీఆర్సీ కోసం ఎదురుచూపులు.. బకాయిల కోసం నిరీక్షణ.. --పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వానికి సంఘం సూటి ప్రశ్నలు

Select Suryaa Now
-చందాలు వసూలు చేస్తున్నారు.. వైద్యం మాత్రం అందడం లేదు!  --పీఆర్సీ కోసం ఎదురుచూపులు.. బకాయిల కోసం నిరీక్షణ..          --పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వానికి సంఘం సూటి ప్రశ్నలు

--చందాలు వసూలు చేస్తున్నారు.. వైద్యం మాత్రం అందడం లేదు!

--పీఆర్సీ కోసం ఎదురుచూపులు.. బకాయిల కోసం నిరీక్షణ..        

--పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వానికి సంఘం సూటి ప్రశ్నలు

వైరా రూరల్ (సూర్య న్యూస్):-

ఉద్యోగ విరమణ తర్వాత ప్రశాంతంగా జీవించాల్సిన పెన్షనర్లు తమ హక్కుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని, అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సేవలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వైరాలోని పెన్షనర్ల భవనంలో శనివారం మండల శాఖ అధ్యక్షుడు చల్లా కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు మేదరమెట్ల సుబ్బయ్య, రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు యనమద్ది వెంకటేశ్వరరావు, జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు రమణ యాదవ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మేదరమెట్ల సుబ్బయ్య మాట్లాడుతూ పీఆర్సీని వెంటనే ప్రకటించి ఉద్యోగులు, పెన్షనర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పట్టభద్రులందరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
రాష్ట్ర ఉపాధ్యక్షుడు యనమద్ది వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పెన్షనర్లకు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంకా హెల్త్ కార్డులు నమోదు చేసుకోని పెన్షనర్లు వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు.
మండల శాఖ అధ్యక్షుడు చల్లా కృష్ణారావు మాట్లాడుతూ ఉద్యోగుల వేతనాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ల నుంచి గత ఆరు నెలలుగా హెల్త్ కార్డుల కోసం చందాలు వసూలు చేస్తున్నప్పటికీ, అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో నగదు రహిత వైద్యం అమలు కాకపోవడం విచారకరమన్నారు. అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు వైద్య ఖర్చుల కోసం ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పథకానికి చందాలు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ వైద్య సేవల అమలులో జాప్యం జరగడం, హెల్త్ కార్డుల డౌన్‌లోడ్‌లో సమస్యలు తలెత్తడం పెన్షనర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలిపారు. హెల్త్ కార్డులను సులభంగా పొందేలా చర్యలు తీసుకోవడంతోపాటు పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ జీవితకాల సేవలకు ప్రతిఫలంగా కోరుతున్నది విలాసాలు కాదు.. సకాలంలో అందాల్సిన బకాయిలు, గౌరవప్రదమైన జీవనం, అవసరమైనప్పుడు అందుబాటులో ఉండే వైద్య భరోసా. ఈ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని సంఘం నాయకులు కోరారు.
ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల జయశంకర్, ఆర్థిక కార్యదర్శి సామినేని వెంకటేశ్వరరావు, అసోసియేట్ అధ్యక్షుడు షేక్ వలీజాన్, ఉపాధ్యక్షుడు నడిపల్లి పెంటయ్య, మండల బాధ్యులు గణపవరపు వెంకట కృష్ణారావు, సూతకాని ప్రసాద్, కొంగర నాగేశ్వరరావు, వేమూరి సత్యనారాయణ, బుడిగి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.