పారా ఆసియన్ గేమ్స్‌లో రవి కార్తీక్‌కు మూడు పతకాలు,
జంగారెడ్డిగూడెం- మేజర్ న్యూస్,జపాన్‌లో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు జరిగిన పారా ఆసియన్ గేమ్స్–2026లో యువ క్రీడాకారుడు రవి కార్తీక్ బుడిగిన స్విమ్మింగ్ విభాగంలో రెండు రజత పతకాలు, ఒక కాంస్య పతకాన్ని సాధించినట్లు బుడిగిన నాగేంద్ర కుమార్ తెలిపారు. 100 మీటర్ల ఫ్రీస్టైల్, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగాల్లో రజత పతకాలు, 50 మీటర్ల ఫ్రీస్టైల్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా అభినందించినట్లు తెలిపారు. ఈ విజయంతో రవి కార్తీక్ 2027లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్, 2028లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో నిర్వహించే పారాలింపిక్స్‌కు అర్హత సాధించడం విశేషమని నాగేంద్ర కుమార్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి మూడు పతకాలు సాధించడం గర్వకారణమని పేర్కొంటూ, రానున్న పోటీల్లోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.