BREAKING
బి-ఫామ్ సమర్పించిన గుండె హరీష.. గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అడుగులు! ఖమ్మం విజయ డైరీ ముందు బిజెపి ధర్నా --డి.డి కి వినతి పత్రం అందజేత --ఖమ్మం బిజెపి టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి-కొత్తపల్లి గోరి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నియామకాలు లేకుండానే కోట్ల చెల్లింపులా? బ్రిగేడ్ ఏజెన్సీపై విచారణకు కాంగ్రెస్ డిమాండ్ రూ.750 కోట్లతో భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కాలేశ్వరంపై కుట్ర పన్నింది సీఎం రేవంత్ రెడ్డి రోస్టర్ కేటాయింపులో మాలలకు తీవ్ర అన్యాయం జైత్వారం అంగన్వాడీ కేంద్రంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం చీరాలలో వైసీపీ చైర్మన్ అభ్యర్థి కారుపై దాడి వాల్మీకి జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవాలి -పుణ్యపురంలో ఉచిత మెగా వైద్య శిబిరం.. --ప్రజలకు వైద్య సేవలు అందించిన సర్పంచ్ మరియమ్మ --గ్రేస్ జనరల్ హాస్పిటల్ సహకారంతో నిర్వహణ. --ఉచితంగా బీపీ, షుగర్, కంటి పరీక్షలు.. --అవసరమైన వారికి మందుల పంపిణీ పట్టభద్రుల ఓటు నమోదుపై కాంగ్రెస్ దూకుడు --ఏడు గ్రామాల్లో ఓటరు నమోదు కేంద్రాలు.. --అర్హులైన ప్రతి పట్టభద్రుడూ ఓటరుగా నమోదు కావాలి: శీలం చంద్రశేఖర్ రెడ్డి ఓప్రా విన్‌ఫ్రే స్కాలర్‌షిప్ ఫండ్.. 30 ఏళ్లలో వందలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు -చందాలు వసూలు చేస్తున్నారు.. వైద్యం మాత్రం అందడం లేదు! --పీఆర్సీ కోసం ఎదురుచూపులు.. బకాయిల కోసం నిరీక్షణ.. --పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వానికి సంఘం సూటి ప్రశ్నలు ప్రజల్లోకి దూసుకెళ్తున్న టీడీపీ అభ్యర్థి కవిత మురళి

76 ఏళ్ల వృద్ధుడి పాణాలు కాపాడిన యశోద ఆసుపత్రి వైద్యులు

Select Suryaa Now
76 ఏళ్ల వృద్ధుడి పాణాలు కాపాడిన యశోద ఆసుపత్రి వైద్యులు

మెదడులో రక్తస్రావంతో స్పృహ కోల్పోయిన వృద్ధుడు..

 అత్యవసర సర్జరీతో ప్రాణాలు కాపాడిన యశోద ఆసుపత్రి వైద్యులు…

 అపస్మారక స్థితిలో పడిపోతే ఏమాత్రం ఆలస్యం చేయకండి…

కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డా. సాయుజ్ కృష్ణన్,  ఆసుపత్రి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదుర….

 

 అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం ప్రాణాపాయానికి సంకేతం కావచ్చు, ఆలస్యం చేయవద్దని మలక్‌పేట్ యశోదా ఆసుపత్రి వైద్యులు హెచ్చరించారు. మెదడులో రక్తస్రావం, హైడ్రోసెఫలస్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న షాద్‌నగర్‌కు చెందిన 76 ఏళ్ల వృద్ధుడికి అత్యవసర న్యూరోసర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన విషయాన్ని వారు వెల్లడించారు. 

షాద్‌నగర్ పట్టణంలోని దేవి గ్రాండ్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డా. సాయుజ్ కృష్ణన్,  ఆసుపత్రి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదుర మాట్లాడారు

వృద్ధుడు అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడంతో స్థానిక ఆసుపత్రిలో సీటీ స్కాన్ చేయగా మెదడు కుడివైపు థాలమస్‌లో 40×24 మిమీ రక్తస్రావం, అది వెంట్రికల్స్‌లోకి విస్తరించడం, మెదడు మధ్యరేఖ 7 మిమీ మేర జరగడం, హైడ్రోసెఫలస్ ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. ఎడమవైపు పక్షవాతంతో యశోదాకు తరలించగా, అత్యవసరంగా పుర్రెకు చిన్న రంధ్రం చేసి ఎక్స్‌టర్నల్ వెంట్రిక్యులర్ డ్రెయిన్ అమర్చి మెదడులో పేరుకున్న ద్రవాన్ని తొలగించినట్లు డా. సాయుజ్ కృష్ణన్ వివరించారు. దీంతో హైడ్రోసెఫలస్ తగ్గిందని చెప్పారు.

దీర్ఘకాలిక వెంటిలేటర్ అవసరం కావడంతో ట్రాకియోస్టమీ చేయడంతో పాటు, అధిక రక్తపోటుకు డా. సీతారామ్ దోసపాటి, పొత్తికడుపు ఉబ్బరం (ఐలియస్)కు డా. వెంకటేష్ శ్రీపతి చికిత్స అందించారని తెలిపారు. ప్రస్తుతం రోగి పరిస్థితి స్థిరంగా ఉందని, కుటుంబ సభ్యుల కోరిక మేరకు పునరావాస కేంద్రానికి తరలించినట్లు వెల్లడించారు.

అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, పక్షవాతం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే నిపుణుల వైద్య సహాయం తీసుకోవాలని ఈ సందర్భంగా వైద్యులు సూచించారు.

నరసింహ రెడ్డి మేజర్ న్యూస్….