BREAKING
బి-ఫామ్ సమర్పించిన గుండె హరీష.. గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అడుగులు! ఖమ్మం విజయ డైరీ ముందు బిజెపి ధర్నా --డి.డి కి వినతి పత్రం అందజేత --ఖమ్మం బిజెపి టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి-కొత్తపల్లి గోరి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నియామకాలు లేకుండానే కోట్ల చెల్లింపులా? బ్రిగేడ్ ఏజెన్సీపై విచారణకు కాంగ్రెస్ డిమాండ్ రూ.750 కోట్లతో భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టు: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కాలేశ్వరంపై కుట్ర పన్నింది సీఎం రేవంత్ రెడ్డి రోస్టర్ కేటాయింపులో మాలలకు తీవ్ర అన్యాయం జైత్వారం అంగన్వాడీ కేంద్రంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమం చీరాలలో వైసీపీ చైర్మన్ అభ్యర్థి కారుపై దాడి వాల్మీకి జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవాలి -పుణ్యపురంలో ఉచిత మెగా వైద్య శిబిరం.. --ప్రజలకు వైద్య సేవలు అందించిన సర్పంచ్ మరియమ్మ --గ్రేస్ జనరల్ హాస్పిటల్ సహకారంతో నిర్వహణ. --ఉచితంగా బీపీ, షుగర్, కంటి పరీక్షలు.. --అవసరమైన వారికి మందుల పంపిణీ పట్టభద్రుల ఓటు నమోదుపై కాంగ్రెస్ దూకుడు --ఏడు గ్రామాల్లో ఓటరు నమోదు కేంద్రాలు.. --అర్హులైన ప్రతి పట్టభద్రుడూ ఓటరుగా నమోదు కావాలి: శీలం చంద్రశేఖర్ రెడ్డి ఓప్రా విన్‌ఫ్రే స్కాలర్‌షిప్ ఫండ్.. 30 ఏళ్లలో వందలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు -చందాలు వసూలు చేస్తున్నారు.. వైద్యం మాత్రం అందడం లేదు! --పీఆర్సీ కోసం ఎదురుచూపులు.. బకాయిల కోసం నిరీక్షణ.. --పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వానికి సంఘం సూటి ప్రశ్నలు ప్రజల్లోకి దూసుకెళ్తున్న టీడీపీ అభ్యర్థి కవిత మురళి

టీడీపీని వీడి వైసీపీలో చేరిన నాయకుడు రమేష్ సూపర్ సిక్స్ హామీల అమలులో వైఫల్యమే పార్టీ మార్పునకు కారణం: రమేష్

Select Suryaa Now
టీడీపీని వీడి వైసీపీలో చేరిన నాయకుడు రమేష్  సూపర్ సిక్స్ హామీల అమలులో వైఫల్యమే పార్టీ మార్పునకు కారణం: రమేష్

బొమ్మనహల్ (రాయదుర్గం ఇంచార్జ్, మేజర్ న్యూస్) : తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. బొమ్మనహల్ మండలం గోవిందవాడ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు భీమన్నగారి రమేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ నాయకుడు మెట్టు గోవిందరెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మెట్టు గోవిందరెడ్డి రమేష్‌కు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో తనకు సరైన గుర్తింపు లభించకపోవడంతో పాటు, ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకపోవడం వల్ల ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ కారణాలతోనే టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరినట్లు పేర్కొన్న ఆయన, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ చేరికతో గోవిందవాడ గ్రామంలో వైసీపీకి మరింత బలం చేకూరుతుందని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ జెడ్పీటీసీ లోకేష్, ఎంపీటీసీ అభ్యర్థి శాంతిమూర్తి, చెన్నబసవ, ధనుంజయ, ఈశ్వరప్ప, ఫకీర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : శివప్రసాద్, రాయదుర్గం ఇంచార్జ్, రాయదుర్గం.