పదవ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షరిపున్ తాజ్ ప్రచార హోరు
కదిరి మున్సిపల్ పరిధిలోని పదవ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షరీఫున్ రెండవ రోజు తన ప్రచార కార్యక్రమంలో జోరు పెంచారు. వార్డు పరిధిలో ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అలాగే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి షేక్ అర్షియాభాను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇంటింటా ప్రచార కార్యక్రమం లో ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం వల్ల ప్రజల సైతం తమతో మాట కలుపుతున్నట్లు తెలియజేశారు. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కదిరి మున్సిపల్ అభివృద్ధికి నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తు న్నట్లు తెలియజే శారు. అభివృద్ధి చేస్తున్న పార్టీకి ఆదరిస్తే మరింత అభివృద్ధిలో ముందుకు వెళ్తామని ప్రజలకు కౌన్సిలర్ అభ్యర్థి షరిఫున్ తాజ్, టిడిపి నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టిడిపి నాయకులు పాల్గొన్నారు.