తుమ్మిడిహెట్టిపై ఫోకస్: రేపు ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి
గోదావరి నదీ జలాలకు సంబంధించి కీలకమైన తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ అంశంపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముంబైలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన రేపు సాయంత్రం ముంబైకి చేరుకోనున్నారు.
ఎల్లుండి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అత్యంత కీలకమైన 'తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్' పై మహారాష్ట్ర ప్రభుత్వంతో ఆయన చర్చలు జరపనున్నారు. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగే ఈ చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.