రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా నివాసంలో కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్, నీలం మధు
సంగారెడ్డి: రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని పటాన్‌చెరు కాంగ్రెస్ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్ గౌడ్, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి నీలం మధు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన నివాసానికి వెళ్లిన నేతలు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డిని శాలువాతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. విజయదశమి పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు నింపాలని ఆకాంక్షించారు.