కొనరావుపేటలో భూముల రీసర్వే కు రైతులుఅదనపు కలెక్టర్ గడ్డం నగేష్
సూర్య కోనరావుపేట..భూముల రీసర్వే కు రైతులు సహకరించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ కోరారు.కోనరావుపేట మండలం మర్తనపేట గ్రామంలో భూముల రీ సర్వే కొనసాగుతుండగా, శనివారం క్షేత్రస్థాయిలో అదనపు కలెక్టర్ పరిశీలించారు.అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మాట్లాడుతూ భూముల వివరాలను క్షేత్రస్థాయిలో పక్కాగా సేకరించాలని, రోజూ వారీగా లక్ష్యం నిర్దేశించుకుని, రీ సర్వే పూర్తి పారదర్శకతతో చేయాలని అధికారులకు సూచించారు.గ్రామాల్లో సర్వే చేసే ముందు ఏ ఏ సర్వే నంబర్ భూముల రీ సర్వే చేయనున్నారో సమాచారం చేరవేయాలని ఆదేశించారు. రీ సర్వే, ఇతర పనులను తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. సర్వే పై ఎలాంటి అపోహలు వద్దని, సర్వేకు రైతులు పూర్తిస్థాయిలో సహకరించాలని తెలిపారు.వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు సాగు చేయాలి.సూపర్ ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా.. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారుల సూచనల మేరకు రైతులు పంటలు సాగు చేయాలని సూచించారు. యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని పేర్కొన్నారు. ఆయిల్ పామ్, పప్పు ధాన్యాలు, కూరగాయలు, ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు.సమావేశంలో ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, తహసీల్దార్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.