BREAKING
మల్కాపూర్‌ అసైన్డ్‌ భూములపై అంతుచిక్కని భూసేకరణ వ్యవహారం! మిత్రమా ఎలా ఉన్నావ్.. స్నేహం కోసం... 31 గిన్నస్ ప్రపంచ రికార్డులతో చరిత్ర సృష్టించిన గీతం పూర్వ విద్యార్థిని కేవలం రూ. 2.5 కోట్ల బడ్జెట్.. వంద కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద కన్నడ సినిమా సెన్సేషన్! కరువు మండలంగా ప్రకటించాలి తెలంగాణ రాష్ట్ర యూత్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పులిమామిడి రాజు ప్రజల నమ్మకాన్ని గెలిపిస్తాను. కౌన్సిలర్ రామయ్య. మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం 24వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అనాథ పిల్లలకు అన్నదానం రామ్ చరణ్, సుకుమార్ క్రేజీ కాంబో 'RC17' మూవీ లాంచ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే? మనోజ్ బాజ్ పాయ్ కొత్త సినిమా 'గజబ్ రాత్' రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? రైతు కష్టాలు మా కష్టాలే.. అన్నదాతకు ప్రభుత్వం అండగా ఉంటుంది నందికంది గ్రామాన్ని వణికిస్తున్న బ్లూక్రాఫ్ట్ ఆగ్రో కాలుష్యం! వైఎస్సార్‌సీపీ నాయకుడు జగన్ మోహన్‌రెడ్డి మృతికి కాటసాని సంతాపం ఎన్నికల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గొడవలకు ఆజ్యం పోసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు గొడశలపల్లి, కూడ్లూరు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించిన హీరేహాళ్ ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి ప్రత్యేక పూజలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు

వన్యప్రాణుల సంరక్షణకు పోలీసు, అటవీ శాఖల సమిష్టి కృషి అవసరo- ఎస్పీ అఖిల్ మహాజన్

Select Suryaa Now
వన్యప్రాణుల సంరక్షణకు పోలీసు, అటవీ శాఖల సమిష్టి కృషి అవసరo- ఎస్పీ అఖిల్ మహాజన్

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి:వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ కేవలం ఒక శాఖ బాధ్యత మాత్రమే కాదని, పోలీసు, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే అక్రమ కార్యకలాపాలను పూర్తిస్థాయిలో అరికట్టడం సాధ్యమవుతుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  అన్నారు. వన్యప్రాణుల వేటగాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం, వన్యప్రాణులను సంహరించిన కేసుల్లో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించడం, నిందితులకు న్యాయస్థానంలో శిక్షలు పడేలా అనుసరించాల్సిన విధానాలపై పోలీసు, అటవీ శాఖ అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ శిక్షణ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. అడవుల్లో పులులు, ఇతర వన్యప్రాణులను వేటాడటం, అక్రమంగా కలప తరలించడం, పొలాల్లో అక్రమంగా విద్యుత్ వైర్లు ఏర్పాటు చేసి వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పు కలిగించడం, మారుమూల ప్రాంతాల్లో గంజాయి సాగు చేయడం వంటి అక్రమ కార్యకలాపాలను సమర్థవంతంగా అడ్డుకోవాలని ఎస్పీ సూచించారు. ఇలాంటి కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం అటవీ శాఖ అధికారులకు తెలిసిన వెంటనే జిల్లా పోలీసు అధికారులకు తెలియజేసి, సమన్వయంతో చర్యలు చేపట్టాలని తెలిపారు.వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించి నమోదయ్యే కేసుల్లో నిందితులకు శిక్షలు పడటం అత్యంత కీలకమని, అందుకు అనుగుణంగా దర్యాప్తు అధికారులు సాక్ష్యాధారాలను పకడ్బందీగా సేకరించాలని సూచించారు. కేసుల దర్యాప్తు నుంచి న్యాయస్థానంలో విచారణ పూర్తయ్యే వరకు కోర్టు డ్యూటీ అధికారులు, దర్యాప్తు అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని, చట్టపరమైన అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ప్రజల ఆస్తులు, ప్రాణాల రక్షణతో పాటు పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణకు కూడా పోలీసు శాఖ ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. రెండు శాఖల అధికారులు పరస్పర సమాచార మార్పిడి, సమన్వయంతో పనిచేస్తూ అక్రమ కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. యూనిఫామ్ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఇన్‌చార్జి డీఎఫ్‌ఓ సుశాంత్ సుఖదేవ్ ఐఎఫ్‌ఎస్, శిక్షణలో ఉన్న ఐఎఫ్‌ఎస్ అధికారులు, ఎఫ్‌ఆర్‌ఓలు, డిప్యూటీ ఎఫ్‌ఆర్‌ఓలు, రేంజ్ అధికారులు, కోర్టు డ్యూటీ అధికారులు, దర్యాప్తు అధికారులు, రైటర్లు, ఇతర పోలీసు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. వీసీ ద్వారా కూడా పలువురు అధికారులు, సిబ్బంది శిక్షణలో పాల్గొన్నారు.