BREAKING
మల్కాపూర్‌ అసైన్డ్‌ భూములపై అంతుచిక్కని భూసేకరణ వ్యవహారం! మిత్రమా ఎలా ఉన్నావ్.. స్నేహం కోసం... 31 గిన్నస్ ప్రపంచ రికార్డులతో చరిత్ర సృష్టించిన గీతం పూర్వ విద్యార్థిని కేవలం రూ. 2.5 కోట్ల బడ్జెట్.. వంద కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద కన్నడ సినిమా సెన్సేషన్! కరువు మండలంగా ప్రకటించాలి తెలంగాణ రాష్ట్ర యూత్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న పులిమామిడి రాజు ప్రజల నమ్మకాన్ని గెలిపిస్తాను. కౌన్సిలర్ రామయ్య. మల్లారెడ్డి సేవలు చిరస్మరణీయం 24వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అనాథ పిల్లలకు అన్నదానం రామ్ చరణ్, సుకుమార్ క్రేజీ కాంబో 'RC17' మూవీ లాంచ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే? మనోజ్ బాజ్ పాయ్ కొత్త సినిమా 'గజబ్ రాత్' రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? రైతు కష్టాలు మా కష్టాలే.. అన్నదాతకు ప్రభుత్వం అండగా ఉంటుంది నందికంది గ్రామాన్ని వణికిస్తున్న బ్లూక్రాఫ్ట్ ఆగ్రో కాలుష్యం! వైఎస్సార్‌సీపీ నాయకుడు జగన్ మోహన్‌రెడ్డి మృతికి కాటసాని సంతాపం ఎన్నికల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గొడవలకు ఆజ్యం పోసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు గొడశలపల్లి, కూడ్లూరు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించిన హీరేహాళ్ ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి ప్రత్యేక పూజలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు

దొంగ అరెస్ట్ - నగదు స్వాధీనం - తళమడుగు ఎస్‌హెచ్‌ఓ డి. రాధిక

Select Suryaa Now
దొంగ అరెస్ట్ - నగదు స్వాధీనం - తళమడుగు ఎస్‌హెచ్‌ఓ డి. రాధిక

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : తళమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడిని తాళమడుగు పోలీసులు అరెస్ట్ చేసి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తలమడుగు ఎస్ఐ డి రాధిక తెలియజేశారు.ఈ నెల 21వ తేదీ రాత్రి దేవాపూర్ గ్రామంలో శారదాదేవి విగ్రహ నిమజ్జన ఊరేగింపు జరుగుతున్న సమయంలో గ్రామానికి చెందిన అంగ రాజు తన భార్య, పిల్లలతో కలిసి ఊరేగింపుకు వెళ్లాడు. తిరిగి అర్ధరాత్రి ఇంటికి వచ్చి చూడగా బీరువా తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించాడు. పరిశీలించగా మూడు తులాల వెండి పట్టీలు, రూ.15,000 నగదు కనిపించకపో వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు తాళమడుగు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా ఈ నెల 24వ తేదీ ఉదయం కజ్జర్ల ఎక్స్‌రోడ్డు సమీపంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని పట్టుకుని విచారించారు. అతడు ఆదిలాబాద్‌లోని కేఆర్‌కే కాలనీకి చెందిన మాకల రాజు (35), ప్రస్తుతం దేవాపూర్‌లో ఉంటున్నట్లు గుర్తించారు. విచారణలో చోరీకి పాల్పడినట్లు వెల్లడైంది.నిందితుడి వద్ద నుంచి మూడు తులాల వెండి పట్టీలు, రూ.10,130 నగదు, హోండా యాక్టివా ద్విచక్ర వాహనం, రెడ్‌మీ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేసిన నగదులో కొంత ఖర్చు చేసినట్లు విచారణలో వెల్లడైంది.