ఉపరాష్ట్రపతి తిరుమల పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
రేణిగుంట మేజర్ న్యూస్: ఈ నెల 26, 27 తేదీల్లో గౌరవ ఉపరాష్ట్రపతి తిరుమల పర్యటన నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయం, తిరుచానూరు, తిరుమలలో చేపట్టిన ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు శనివారం తనిఖీ చేశారు. పర్యటనకు సంబంధించి భద్రతా చర్యలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఉపరాష్ట్రపతి పర్యటన విజయవంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.