జగ్గయ్యపేటలో ముమ్మరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం
జగ్గయ్యపేటలో ముమ్మరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం.
జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-జగ్గయ్యపేట పట్టణ ప్రజల నుంచి విశేష స్పందన.. మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు
కూటమి నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానం చెక్కుచెదరదు.
జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు.
వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ (చిన్న).
జగ్గయ్యపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా పట్టణంలోని 7 వార్డులో పార్టీ నాయకులు, అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ పార్టీ అభ్యర్థులకు మద్దతు కోరారు. ఈ ప్రచార కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అయన సతీమణి తన్నీరు సుధారాణి, వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజా గోపాల్ (చిన్న), పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి షేక్ హఫీజున్నిసా, 7 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పాగోల్ బ్యూలా ప్రియదర్శిని, ఆరో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బొజ్జ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లో అసంతృప్తి ఉందని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, పెన్షన్లు, రేషన్ కార్డుల మంజూరు వంటి అంశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు.
ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, తమకు ఇచ్చిన హామీల అమలును ఓటర్లు నిశితంగా గమనిస్తున్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి లభిస్తున్న స్పందన తమకు ప్రోత్సాహాన్నిస్తోందని పేర్కొన్నారు.
కూటమి నాయకులు ఎన్ని రాజకీయ ప్రయత్నాలు చేసినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని ఇంటూరి రాజా గోపాల్ (చిన్న) అన్నారు.
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను గెలిపించండి.
జగ్గయ్యపేట పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని నాయకులు ప్రజలను కోరారు. మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి షేక్ హఫీజున్నిసా, ఐదో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పాగోల్ బ్యూలా ప్రియదర్శిని, ఆరో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బొజ్జ లక్ష్మిలకు తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
రిపోర్టర్ :-శివా జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా