ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీల పంపిణీ.
సూర్య రాజంపేట రాజంపేట మండలలోని
అర్గోండ గ్రామంలో శనివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సహకారంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. అర్హులైన పేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. లబ్ధిదారులు త్వరలోనే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించి, నాణ్యతతో నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సూర్యజి, సర్పంచ్ ఎర్ర విక్రాంత్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర ప్రణీత్ రెడ్డి, గ్రామ అధ్యక్షుడు చౌదరి రాజు, ఉపసర్పంచ్ తుల రవి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు, లబ్ధిదారులు పాల్గొన్నారు...