BREAKING
పారా ఆసియన్ గేమ్స్‌లో రవి కార్తీక్‌కు మూడు పతకాలు, ప్రచారంలో దూసుకుపోతున్న సిపిఐ పార్టీ 37వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎస్.కె సబిహా జిల్లా గ్రంథాలయంలో అదనపు కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ నాగపూర్ గ్రామంలో పల్లె నిద్ర.. తుమ్మిడిహెట్టిపై ఫోకస్: రేపు ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి అల్లూరి జిల్లాలో ఘోర పేలుడు.. 7గురు మృతి పదవ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షరిపున్ తాజ్ ప్రచార హోరు ప్రచారంలో దూసుకుపోతున్న మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి మొల్ల సాబేరున్నిసా...! ఎన్‌హెచ్‌ఏఐ రోడ్డు పనుల్లో నాణ్యతకు తూట్లు వేకనూరులో వైభవంగా సామూహిక కుంకుమ పూజ అద్దంకిలో 32 నామినేషన్లు తిరస్కరణ. టీడీపీని వీడి వైసీపీలో చేరిన నాయకుడు రమేష్ సూపర్ సిక్స్ హామీల అమలులో వైఫల్యమే పార్టీ మార్పునకు కారణం: రమేష్ 76 ఏళ్ల వృద్ధుడి పాణాలు కాపాడిన యశోద ఆసుపత్రి వైద్యులు ఎన్నికల కోడ్ నేపథ్యంలో పీజీఆర్ఎస్ రద్దు డిసెంబర్ 3 వరకు ప్రజా ఫిర్యాదుల స్వీకరణకు తాత్కాలిక విరామం పలమనేరులో కూటమి ప్రచార జోరు

రూ.18.70 కోట్ల నిధులపై సమగ్ర విచారణ జరపాలి - సిపిఎం

Select Suryaa Now
రూ.18.70 కోట్ల నిధులపై సమగ్ర విచారణ జరపాలి - సిపిఎం
సూర్య,కాగజ్‌నగర్‌ : కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో యూఐడీఎఫ్‌ నిధులు రూ.18.70 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనుల టెండర్లలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని సీపీఎం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కమిటీ సభ్యుడు ముంజం ఆనంద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం కాగజ్నగర్ సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి, టెండర్ల వ్యవహారంలో పారదర్శకతను నిర్ధారించాలని కోరారు.టెండర్లలో గుత్తేదారులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు, పర్సంటేజీల పంపకాలపై ప్రచారంలో ఉన్న అంశాలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. టెండర్‌ నోటిఫికేషన్లు, బిడ్డింగ్‌ వివరాలు, అంచనా వ్యయాలు, సాంకేతిక అనుమతులు, వర్క్‌ ఆర్డర్లను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. కాంట్రాక్టర్ల మధ్య ముందస్తు ఒప్పందాలు జరిగాయా? పోటీని అడ్డుకునే ప్రయత్నాలు చేశారా? నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కేటాయించారా? అనే అంశాలను ఆధారాలతో తేల్చాలని పేర్కొన్నారు.
- అధికారులు, కౌన్సిల్‌ పాత్రపైనా విచారణ జరపాలి:టెండర్ల ప్రక్రియలో మున్సిపల్‌ అధికారులు, కౌన్సిల్‌ సభ్యులు లేదా ఇతరుల ప్రమేయం ఉన్నట్లు తేలితే, వారి హోదాతో సంబంధం లేకుండా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆనంద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. అక్రమ లావాదేవీలు, కమీషన్ల పంపకాలు జరిగినట్లు ఆధారాలు లభిస్తే సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులు, మధ్యవర్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఇప్పటికే ప్రారంభమైన అభివృద్ధి పనుల అంచనా వ్యయం, వాస్తవ ఖర్చులు, ఉపయోగించిన నిర్మాణ సామగ్రి, పనుల నాణ్యతపై స్వతంత్ర తనిఖీలు నిర్వహించాలని సూచించారు. టెండర్లలో అక్రమాలు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం వాటిని రద్దు చేసి, పారదర్శకంగా మళ్లీ టెండర్లు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. విచారణ పూర్తయ్యే వరకు ప్రజాధనానికి నష్టం కలగకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరార.
- ప్రజాధనానికి రక్షణ కల్పించాలి:ప్రజల అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ నిధులు అభివృద్ధి పనులకే వినియోగించబడాలని, ఎలాంటి అక్రమాలకు తావివ్వకూడదని ఆనంద్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఆరోపణలు నిజమో కాదో నిష్పక్షపాత విచారణ ద్వారా తేల్చి, విచారణ నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రజాధనం వినియోగంలో జవాబుదారీతనం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మాదారపు శ్రీనివాసరావు, బొర్కుట్‌ రాజేందర్‌, కోట శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.