BREAKING
కోస్తాంధ్రకు హైఅలర్ట్.. కాకినాడ - నర్సాపురం మధ్య తీరం దాటనున్న తుఫాన్! అభివృద్ధి అంటే జీజేఎంకే సాధ్యం - 52వ వార్డులో 45 లక్షలతో రెండు సిమెంట్ రోడ్లు పూర్తి, మరో రెండుకు శంకుస్థాపన - మేయర్ అభ్యర్థి కటారి హేమలత గెలుపు కోసం ' యువ కార్పొరేటర్ పీఎస్ చందు ఇంటింటి ప్రచారం కూటమి అభ్యర్థి వెంకట సాయి ని ఆశీర్వదించండి.. 21వ డివిజన్లో భవాని రవికుమార్, దేవానంద్ విస్తృత ప్రచారం కరువు ప్రమాదం పొంచి ఉంది కొత్త బోర్లకు అడ్డుకట్ట వేసేది ఎవరు? నేడు ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి.. రేపు మహారాష్ట్ర సీఎంతో కీలక భేటీ! మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి....! సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డి ​ట్రాన్స్‌ఫార్మర్‌ను కమ్మేసిన పిచ్చి మొక్కలు కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా పనిచేయాలి.. టి సి వరుణ్.. పాతూరులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం దర్శి మున్సిపాలిటీ ఏకగ్రీవం.చైర్మన్ గా దారం సుబ్బారావు ఎన్నిక. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా.. జీడబ్ల్యూఎంసీ కఠిన నిర్ణయం! అనాధ వృద్ధులు దివ్యాంగులకు బాలవికాస అండ వైసీపీని వీడి టిడిపిలో చేరిన 30 మంది యువకులు...! ప్రతి గ్రామం అభివృద్ధి లక్ష్యం. మంత్రి దాతలతో నిర్మించిన భవనాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవాలి

అటవీ విస్తీర్ణం పెంపుదల, కలప,జంతువుల స్మగ్లింగ్ అరికట్టడమే ధ్యేయం ---జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

Select Suryaa Now
అటవీ విస్తీర్ణం పెంపుదల, కలప,జంతువుల స్మగ్లింగ్ అరికట్టడమే ధ్యేయం  ---జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

మెదక్ … కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ , జిల్లా అటవీ సంరక్షణ కమిటీ చైర్మన్  అధ్యక్షతన జిల్లా స్థాయి అటవీ సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి , పోలీస్ అధికారులు,  కమిటీ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. జిల్లాలో అడవుల సంరక్షణకు ,పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.జిల్లాలో అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా కఠినమైన నిఘా ఏర్పాటు చేయాలని, సరిహద్దులను జియో-ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షించాలని నిర్ణయించారు. భూముల సమస్యలు, అక్రమ కలప రవాణా వన్యప్రాణుల వేటను అరికట్టడానికి అటవీ , పోలీస్ శాఖలు సంయుక్తంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు.అటవీ సరిహద్దు గ్రామాల్లోని ప్రజలకు, యువతకు అడవుల ప్రాముఖ్యతపై అవగాహన సదస్సులు నిర్వహించాలని, అటవీ సంరక్షణలో వారిని భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు.జిల్లా అటవీ శాఖ అధికారి జో జి మాట్లాడుతూ..అటవీ చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అడవుల రక్షణకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డి ఆర్ వో అంబాదాస్ రాజేశ్వర్,జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నీలిమ ,డిఎస్పీ ప్రసన్న కుమార్, ఫారెస్ట్ రేంజ్ అధికారులు పాల్గొన్నారు.