రోడ్లపై ధాన్యం ఆరబెట్టవద్దు.. రైతులకు రాజంపేట ఎస్ఐ సూచన..
సూర్యరాజంపేట రాజంపేట మండలంలోని రైతులు రోడ్లపై ధాన్యం ఆరబెట్టవద్దని రాజంపేట ఎస్ఐ సూచించారు. రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగడంతో పాటు, ప్రయాణికులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని
రైతులు ధాన్యాన్ని రోడ్లపై కాకుండా ఇతర అనువైన ప్రదేశాల్లో ఆరబెట్టుకోవాలని సూచించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని రోడ్లపై ధాన్యం ఆరబెట్టకుండా పోలీసులకు సహకరించాలని ఎస్ఐ కోరారు.