డబ్బా జీపీలో విధుల నిర్వహణలో నిర్లక్ష్యం?
సూర్య చింతల మానేపల్లి చింతల మానేపల్లి మండల పరిధిలోని డబ్బా గ్రామపంచాయతీలో విధుల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తున్నారని, గ్రామ సమస్యలను పరిష్కరించడంలో సర్పంచ్ తగిన శ్రద్ధ చూపడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలపై పలుమార్లు దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మిషన్ భగీరది నీళ్లు స్వంత పొలాలకు నీళ్లు సరఫరా చేసికుంటున్నారని, బోర్లు స్వంతం మోటర్లు వేసుకొని వాడుకుంటున్నారని చెప్పిన విధులలో నిర్లక్ష్యం ఎందుకు అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామంలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి గ్రామపంచాయతీ పాలకవర్గం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సంబంధిత అధికారులు స్పందించి, గ్రామంలో నెలకొన్న సమస్యలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.