వేమవరంలో 40 ఏళ్ల టీడీపీ ఆధిపత్యానికి తెర.. స్వతంత్ర అభ్యర్థి నంబూరి రాజ్యలక్ష్మి ఘన విజయం
వత్సవాయి మండలం వేమవరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సంచలన ఫలితం వెలువడింది. గత 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులు సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకుంటూ వస్తుండగా, ఈసారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి నంబూరి రాజ్యలక్ష్మి విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు.
తాజాగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నంబూరి రాజ్యలక్ష్మి తన సమీప ప్రత్యర్థిపై 171 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న టీడీపీ మద్దతుదారుల విజయ పరంపరకు ఈ ఎన్నికలతో బ్రేక్ పడింది.
కౌంటింగ్ ఫలితాలు వెలువడిన అనంతరం రాజ్యలక్ష్మి విజయం పట్ల ఆమె మద్దతుదారులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. వేమవరం గ్రామ రాజకీయాల్లో ఈ ఎన్నికల ఫలితం ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది.