BREAKING
మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ వేం నరేందర్‌రెడ్డిని కలిసిన మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న కరీంనగర్ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి అన్ని విధాలా సహకారం కరీంనగర్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. 30న నూతన కలెక్టరేట్ ప్రారంభం విద్యకు కలెక్టర్‌ భరోసా అనాథ వృద్ధులకు లీగల్ అవేర్నెస్ ప్రధాని మోదీతో మహిళ మార్ఫింగ్ ఫొటో వివాదం.. తక్షణమే తొలగించాలని మెటాకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ 27వ తేదీ యధావిధిగా పని చేయనున్న ప్రభుత్వరంగా,గ్రామీణ బ్యాంకులు నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలి జిల్లా పరిషత్ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ఎస్టీయూ పాత్ర కీలకం ఆయుష్మాన్ భారత్ రాకముందు చికిత్స కోసం ఇళ్లు, స్థలాలు అమ్ముకునేవారు: కేంద్ర మంత్రి జేపీ నడ్డా మన ఊరు మనబడి కింద మంజూరైన పాఠశాలలకు పెయింట్స్ వేయండి తిరుమలలో అనంత పద్మనాభస్వామి వ్రతం సందర్భంగా చక్రస్నానం వరద నీటితో బుగ్గ వారి వీధి మునక

వరద నీటితో బుగ్గ వారి వీధి మునక

Select Suryaa Now
వరద నీటితో బుగ్గ వారి వీధి మునక

బుగ్గ వారి వీధిలో మోకాలు లోతు నీరు

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; తాడేపల్లిగూడెం పట్టణంలో స్థానిక 17వ వార్డు, బగ్గా వారి వీధిలో మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రహదారులు మోకాలు లోతు నీటిలో మునిగిపోయాయి. ఇళ్లల్లోకి కూడా నీరు చేరడంతో దిక్కు పోచని స్థితిలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజషన్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ను ఆశ్రయించారు. కనీసం నిలబడడానికి కూడా అవకాశం లేని విధంగా ఇంటిలోకి కూడా నీరు వెళ్లి ఇబ్బందులు పడుతున్న తరుణంలో విషయాన్ని తెలుసుకున్న గొర్రెల శ్రీధర్ స్వయంగా వెళ్లి పరిస్థితిని పరిశీలించి నీటిని బయటకు తరలించే అవకాశం లేక నీటిని తోడే ఇంజన్లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేశారు. ఈ సందర్భంగా ఆ ఇళ్లలో ఉన్నటువంటి వారిని సురక్షిత ప్రదేశంలో ఉండమని చెప్పి, తగు చర్యలు తీసుకునేలాగా తన సొంత ఖర్చులతో ఆ నీటిని బయటకు ప్రయత్నం చేశారు. 17,19,23,24 వార్డులలో కొన్ని ప్రాంతాలలో రోడ్లు నీట మునగడంతో తన సొంత ఖర్చులతో జెసిబిని ఏర్పాటు చేసి ఆ నీటిని బయటకు గండ్లు కొట్టించి... ఆ వర్షపు నీరు బయటకు పోయేలా చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేశారు.

 

 

 రిపోర్టర్ శ్రీనివాస్ తాడేపల్లిగూడెం