గాంధీ పార్క్, మున్సిపల్ క్యాంటీన్ యాక్షన్ మళ్ళీ వాయిదా
ప్రొద్దుటూరు టౌన్ మేజర్ న్యూస్:
సప్టెంబర్ 25 తేదీ శక్రవారం ఉదయం 11 గంటలకు జరగాల్సిన గాంధీ పార్క్, మున్సిపల్ క్యాంటీన్ వేల పాట కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు కమీషనర్ శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు. తదుపరి ఆక్షన్ తేదీ, సమయం ప్రొద్దుటూరు పురజనులకు తెలపడం జరుగుతుందని ఈ సందర్బంగా కమీషనర్ అన్నారు. ప్రజాప్రయోజనార్ధం తీసుకున్న వాయిదా నిర్ణయాన్ని ప్రజలు అందరు అర్ధం చేసుకొని సహకరించమని కమీషనర్ కోరారు. కాగా క్యాంటీన్ నిర్వహణ వేలం ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే.