BREAKING
యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష వృద్ధుల హక్కులపై అవగాహన కల్పించాలి కలెక్టర్‌ కోయ శ్రీహర్ష చిన్నారి అత్యాచారం కేసులు నిందితునికి జీవిత ఖైదు ధాన్యం కొనుగోళ్లకు పటిష్ట ఏర్పాట్లు హమాలీల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలి.. అదనపు కలెక్టర్‌ శ్రీరాములు గత చరిత్ర ఆనవాళ్లకు..ఘనమైన కీర్తి. భూసేకరణలో దళారులను నమ్మొద్దు నష్టపరిహారం నేరుగా బాధితులకే.. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తమిళంలో కీర్తిసురేశ్ 'డొరొథి' మూవీపై ట్రోల్స్ వర్షం.. అసలు కారణం అదేనా! విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌పై షీ టీమ్‌ అవగాహన ఈ నేషనల్ అవార్డు నాది కాదు, మా ఆవిడదే.. డైరెక్టర్ సుకుమార్ భావోద్వేగ వ్యాఖ్యలు! అంగన్వాడి సెంటర్లో పోషణ మాసం కార్యక్రమం.. గిరిజన వసతి గృహాన్ని సందర్శించిన (ట్రైనీ) సబ్ కలెక్టర్ హరిణి. మిడ్ మానేరు త్యాగాలకు విలువేది? పల్లెపండుగ 3.0ను విజయవంతం చేద్దాం డబ్ల్యూఏపీఎల్‌లో గోదావరి గోల్డెన్ ఈగల్స్ జోరు కరీంనగర్‌లో AI UpShift Summit 2026

నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలి

Select Suryaa Now
నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలి

సూర్య జగిత్యాల ప్రతినిధి: భీమారం మండలంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శుక్రవారం ఆకస్మికంగా పర్యటించి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రాజలింగంపేట గ్రామంలో నిర్మాణంలో ఉన్న గ్రామ పంచాయతీ భవనాన్ని పరిశీలించారు. భవన నిర్మాణ పనుల పురోగతిని, నిర్మాణ నాణ్యతను పరిశీలించి, పనులను నిర్దేశిత ప్రమాణాల ప్రకారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా భవనాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ పరిశీలనలో కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహసీల్దార్ వసంత, ఇంజనీర్ శాఖ అధికారులు  తదితరులు పాల్గొన్నారు.