వృద్ధుల హక్కులపై అవగాహన కల్పించాలి కలెక్టర్ కోయ శ్రీహర్ష
సూర్య పెద్దపల్లి ప్రతినిధి
వృద్ధుల సంరక్షణ, భద్రత, సంక్షేమం, చట్టబద్ధమైన హక్కులపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో వయోవృద్ధుల సంక్షేమ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వృద్ధుల సంక్షేమం, హక్కులకు సంబంధించిన పోస్టర్లతో పాటు ‘ఎల్డర్ గైడ్’ పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వృద్ధులను గౌరవంగా చూసుకోవడం, వారి అవసరాలను గుర్తించి సహాయ సహకారాలు అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. వృద్ధుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వృద్ధులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు, సంక్షేమ సేవలపై అవగాహన కల్పించడంలో ‘ఎల్డర్ గైడ్’ ఉపయోగపడుతుందని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ రాజయ్య, టాస్క్ అధికారి కౌసల్య, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత, సీనియర్ సిటిజన్ కమిటీ సభ్యుడు జీవన్‌రాజు, సుల్తానాబాద్ ఓల్డ్ ఏజ్ హోం అధ్యక్షుడు సతీష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.