BREAKING
ట్రంప్-జిన్‌పింగ్ భేటీలో కీలక ఒప్పందం.. అమెరికా బొగ్గు కొనుగోళ్లకు చైనా హామీ, కొనసాగుతున్న సుంకాల చర్చలు ఆసియా క్రీడలు 2026 డే 8 షెడ్యూల్.. రేపు బరిలోకి దిగనున్న భారత అథ్లెట్లు, పతక పోరు వివరాలు ఆమె క‌విత్వం ఆత్మ విశ్వాసానికి ప్ర‌తీక‌.. 4(A) నేవల్ మెడికల్ యూనిట్ NCC వార్షిక తనిఖీ – ‘శిక్షణ’ బహుళ ప్రయోజన శిక్షణా మందిరం ప్రారంభం వాహనాల అతివేగానికి కళ్లెం...? శిథిలావస్థలో మద్ది బ్రిడ్జి..! భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో మహా దారుణం..! అవంతిలో ఘనంగా ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవ వేడుకలు ఒరాకిల్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు రూ.8,200 కోట్ల విలువైన స్టాక్ ఆప్షన్లు.. షేర్ల పతనంతో చిక్కుల్లో పడ్డ నాయకత్వం ఖైరతాబాద్‌ ఉపఎన్నికపై బీజేపీ కసరత్తు ముమ్మరం ఇతర రాష్ట్రాల ఆజ్ఞలను పాటిస్తున్నారు విద్యుత్ రంగాన్ని రేవంత్ ప్రభుత్వం నాశనం చేసింది వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ డైవర్షన్ డ్రామాలు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉభయ గోదావరి జిల్లాల్లో సంచారి సినిమా విడుదల హక్కులను దక్కించుకున్న గాయత్రి ఫిలిమ్స్ మాదాపూర్‌, గచ్చిబౌలిలో 11 హోటళ్ల లైసెన్సులు రద్దు దౌల్తాబాద్‌లో విషాదం:షార్ట్ సర్క్యూట్‌తో గుడిసె దగ్ధం, రూ.20 లక్షలు, బంగారం బూడిద హైదరాబాద్ జీపీఓ స్థాయిని తగ్గించొద్దు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానికి ఒవైసీ లేఖ

పేదలకు పట్టాభిషేకంలో మరో చారిత్రక ఘట్టం.. ఈ నెల 30న విజయవాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ

Select Suryaa Now
 పేదలకు పట్టాభిషేకంలో మరో చారిత్రక ఘట్టం.. ఈ నెల 30న విజయవాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ

సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలకు శాశ్వత ఆస్తి భద్రత కల్పించే లక్ష్యంతో చేపట్టిన 'పేదలకు పట్టాభిషేకం' కార్యక్రమంలో మరో ప్రతిష్టాత్మక ఘట్టానికి శ్రీకారం చుడుతోంది. విశాఖపట్నంలో విజయవంతంగా నిర్వహించిన పట్టాల పంపిణీ స్ఫూర్తితో, ఈ నెల 30వ తేదీన విజయవాడ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వేలాది కుటుంబాలకు ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాలను అందజేయనున్నారు. దశాబ్దాల క్రితం ఎన్టీఆర్ హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలకు సంపూర్ణ చట్టబద్ధత కల్పిస్తూ, లబ్ధిదారులకు సంపూర్ణ యాజమాన్య హక్కులను కట్టబెట్టేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేసింది.

ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలోని 8 శాసనసభ నియోజకవర్గాల్లో గల 15 మండలాలకు చెందిన మొత్తం 24,057 పేద కుటుంబాలకు సంపూర్ణ యాజమాన్య హక్కులు దక్కనున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు రూ.9,800 కోట్ల రిజిస్ట్రేషన్ విలువ కలిగిన 617 ఎకరాల భూమిని (సుమారు 29.86 లక్షల చదరపు గజాలు) క్రమబద్ధీకరించి పేదల పరం చేయనున్నారు. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం దీని విలువ ఏకంగా రూ.24,297 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ నిర్ణయంతో ఒక్కో లబ్ధిదారు కుటుంబానికి సుమారు రూ.40 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు విలువైన స్థిరాస్తిపై సర్వహక్కులు లభించనున్నాయి.

ముఖ్యంగా విజయవాడ నగర పరిధిలోని తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో కొండ ప్రాంతాలపై ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న నిరుపేదల చిరకాల స్వప్నం ఈ నిర్ణయంతో సాకారం కానుంది. విజయవాడ తూర్పులో 7,990, పశ్చిమంలో 7,465, సెంట్రల్‌లో 5,815 కుటుంబాలతో పాటు జగ్గయ్యపేటలో 1,135, మైలవరంలో 981, గన్నవరంలో 602, నందిగామలో 54, తిరువూరులో 15 కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయి. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ మరియు నిరుపేద ఓసీ వర్గాలకు భారీ ఊరట కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.