BREAKING
హైదరాబాద్ జీపీఓ స్థాయిని తగ్గించొద్దు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానికి ఒవైసీ లేఖ బ్రెజిల్‌లో పెరిగిన జీవన వ్యయం.. అధ్యక్షుడు లూలా గెలుపు అవకాశాలకు దెబ్బ! గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లో భారీ పేలుడు కమలాపురం రైలు నిలుపుదలపై కేంద్ర మంత్రికి వినతి.. రైళ్ల పునరుద్ధరణకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ సీఎం రమేష్ నాయుడు - హామీ పేదలకు పట్టాభిషేకంలో మరో చారిత్రక ఘట్టం.. ఈ నెల 30న విజయవాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలిన ఏపీ పీసీబీ ఐలమ్మకు నివాళి.. రావుల స్వామికి సన్మానం దేశం గర్వించదగిన జాతిరత్నం మన్మోహన్‌ సింగ్‌: సీఎం రేవంత్‌రెడ్డి హత్యరాల భక్తుల ఆనంద హేళ రోజూ అన్నం తినడం ఆరోగ్యానికి మంచిదేనా?.. నిపుణులు ఏం చెబుతున్నారు? రైతుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం 1,101 మంది నూతన ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేసిన ఒడిశా సీఎం.. అవినీతికి దూరంగా ఉండాలని మోహన్ మాఝీ హితవు జెన్-జీ ఓటు హక్కును కాలరాసి ఇప్పుడు క్యాంపుల డ్రామా.. ఈసీ తప్పుడు విధానాలపై కాంగ్రెస్ నిప్పులు ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు కోసం అడ్వైజరీ కమిటీ క్షేత్రబాట ఉదయాన్నే పచ్చి వెల్లుల్లి తింటున్నారా?.. నిపుణులు చెబుతున్న ముఖ్యమైన ఆరోగ్య రహస్యాలు ఇవే

దాతల భక్తితో.. సీతారామాలయానికి సువర్ణ వైభవం

Select Suryaa Now
దాతల భక్తితో.. సీతారామాలయానికి సువర్ణ వైభవం


పన్నాల ప్రభాకర్ రెడ్డి జ్ఞాపకార్థం రూ.3.30 లక్షలు.. పద్మలత జ్ఞాపకార్థం రూ.లక్ష విరాళం
చైర్మన్ రాయల శ్రావణ్ కుమార్ గుప్త ఆధ్వర్యంలో సువర్ణ ధ్వజస్తంభ పూజ
కీసర, మేజర్ న్యూస్,( సెప్టెంబర్ 26):
కీసరలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ధ్వజస్తంభానికి ఏర్పాటు చేసిన సువర్ణ తొడుగు పూజా కార్యక్రమం శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ రాయల శ్రావణ్ కుమార్ గుప్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పురోహితులు ప్రభాకర్ పంతులు, బబ్లూ పంతులు, కౌశిక్ పంతులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
దాతల భక్తితో సువర్ణ శోభ
ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు కీ.శే. పన్నాల ప్రభాకర్ రెడ్డి (పప్పు అన్న) జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు ధ్వజస్తంభానికి సువర్ణ తొడుగు ఏర్పాటు కోసం రూ.3.30 లక్షల విరాళం అందించారు. ఆయన సోదరుడు పన్నాల సుధాకర్ రెడ్డి, భార్య జ్యోతి రాణి, సోదరి కందకట్ల సుజాత, కీ.శే. సంజీవరెడ్డి కుటుంబ సభ్యులు ఈ సేవలో భాగస్వాములయ్యారు.అదేవిధంగా కీ.శే. పద్మలత జ్ఞాపకార్థం విశ్రాంత తెలుగు పండిట్ తిరుక్కోవలూరి టీ. భాస్కర స్వామి, ఆయన కుమారులు శ్రీనివాస్, శ్రీధర్, శ్రీకాంత్ కలిసి రూ.లక్ష విరాళాన్ని అందించారు. దాతల సహకారంతో ధ్వజస్తంభానికి సువర్ణ తొడుగు ఏర్పాటు చేయడం పట్ల ఆలయ కమిటీ, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రభాకర్ రెడ్డి సేవలను స్మరించుకున్న సుధాకర్ రెడ్డి

ఈ సందర్భంగా పన్నాల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తన సోదరుడు కీ.శే. పన్నాల ప్రభాకర్ రెడ్డి (పప్పు అన్న) ఆలయ అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారని గుర్తుచేశారు. ఆయన జ్ఞాపకార్థం ధ్వజస్తంభానికి సువర్ణ తొడుగు ఏర్పాటు చేయడంలో కుటుంబ సభ్యులంతా భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు. ప్రభాకర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి తమ కుటుంబం ఎల్లప్పుడూ సహకరిస్తుందని తెలిపారు. శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆశీస్సులు ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు భక్తులందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి ఆనబోయిన జంగయ్య, మాజీ చైర్మన్ నాయకపు వెంకటేష్, మాజీ ఎంపీటీసీ బెలిదే రమేష్ గుప్తా, పీఏసీఎస్ చైర్మన్ రామిడి ప్రభాకర్ రెడ్డి, పన్నాల బాల్ రెడ్డి (చిన్న), కీసర మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కర్రె గణేష్, చినింగని భూపాల్, బలిజ అంజిరెడ్డి, గుర్రం మల్లారెడ్డి, మచ్చని జంగయ్య యాదవ్, గుర్రం లక్ష్మారెడ్డి, ముద్దం వెంకట్ యాదవ్, శీలం మల్లేష్, బండారు శ్రీనివాస్ రెడ్డి, కన్నెబోయిన రమేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.ఆలయ అభివృద్ధికి ఉదారంగా విరాళాలు అందించిన దాతలకు ఆలయ కమిటీ తరఫున చైర్మన్ రాయల శ్రావణ్ కుమార్ గుప్త కృతజ్ఞతలు తెలిపారు. దాతలు, భక్తుల సహకారంతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. సువర్ణ ధ్వజస్తంభం ఆలయానికి మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకువచ్చిందన్నారు. దాతల కుటుంబాలను గ్రామస్తులు అభినందించారు.రిపోర్టర్ కర్రే గణేష్.