ఐలమ్మకు నివాళి.. రావుల స్వామికి సన్మానం
చౌటుప్పల్, మేజర్ న్యూస్: తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ 131వ వర్ధంతిని పురస్కరించుకుని చౌటుప్పల్ మండల, మున్సిపాలిటీ రజక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం బస్టాండ్ ఆవరణలోని ఐలమ్మ విగ్రహం వద్ద కార్యక్రమం నిర్వహించారు. మండల రజక సంఘం అధ్యక్షుడు బాతరాజు యాదగిరి, మున్సిపాలిటీ రజక సంఘం అధ్యక్షుడు కానుగు బాలరాజు ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మానవ హక్కుల కమిషన్ సభ్యుడు చిలకల శ్రీనివాస్‌యాదవ్, చౌటుప్పల్ మండల సింగిల్ విండో డైరెక్టర్ రావుల స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా సింగిల్ విండో డైరెక్టర్‌గా ఎంపికైన రావుల స్వామిని రజక సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు బొల్లారం లక్ష్మీనారాయణ, మలిగే నరసింహ, మండల ప్రధాన కార్యదర్శి సామకూర యాదయ్య, మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి మలిగే బాలకృష్ణ, ఉపాధ్యక్షులు ముదిగొండ వెంకటేశం, కానుగు శివకుమార్, పెడగంటి లింగస్వామి, మలిగే కృష్ణ, కానుగు శేఖర్, మలిగే శ్రీను, బాతరాజు దశరథ, మలిగే చంద్రయ్య, బాతరాజు యాదయ్య, మలిగే శంకర్, రావుల ముత్యాలు, ఎలకరాజు అంజయ్య, బాతరాజు వెంకటేశం, గరిసె నరసింహ, బాతరాజు అశోక్ తదితరులు పాల్గొన్నారు.