BREAKING
మున్సిపల్ చైర్మన్ సీటు జనసేనకి ఇవ్వాలి తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్ల బుకింగ్‌లో భక్తులకు చేదు అనుభవం : శబరిమల టెండర్ వివరాలు లీక్.. 110 దుకాణాల ఈ-వేలం రద్దు.. త్వరలోనే రీ-టెండర్లు పిలవనున్న దేవస్వం బోర్డు +మేడారం మినీ జాతర తేదీలు ఖరారు.. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు +నాలుగు రోజుల పాటు సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు దేశీయ పర్యాటక రంగానికి సరికొత్త ఊతం.. ‘దేఖో అప్నా దేశ్ 2.0’ ప్రచారాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం చెన్నకేశవ స్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి పూజలు ప్రజలతో ఆప్యాయ పలకరింపులు ‎ ‎సామాన్యుడిలా బల్లపై కూర్చొని టీ తాగిన డిప్యూటీ సీఎం ‎ ‎ముదిగొండ టీ స్టాల్ వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముచ్చట్లు ‎ నేపాల్‌లోని హిమ్‌లుంగ్ బేస్ క్యాంప్‌లో హిమపాతం.. ఇద్దరి మృతదేహాలు వెలికితీత ‎కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లే పార్టీకి మూలస్తంభాలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ‎ ‎ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన ‎ ‎రూ. 10 లక్షలకు పెంచిన ఆరోగ్యశ్రీ పరిమితి ‎ ‎ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత అల్పాహారం, పాలు ‎ ‎నవంబర్ 19న ప్రతీ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా పథకం ‘ఇందిరమ్మ భీమా’ పూడిమడకలో ఉప్పుటేరును పరిశీలించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో మళ్లీ షట్‌డౌన్! ఎస్‌ఐఆర్‌’పై అనుమానాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి నేడు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ నిరసనలు టీ పి సీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రోడ్డు ప్రమాదం పై శ్రీమరం పీఠాధిపతులు దిగ్భాంటి హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో అలరించిన చి. వేదాంశ కూచిపూడి నృత్య ప్రదర్శన భారత్‌ ఘనవిజయం.. వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం రవీంద్రభారతిలో ఘనంగా 111వ జయంతి వేడుకలు – చేనేత, బీసీ సంక్షేమం, సామాజిక న్యాయంపై దృష్టి

+మేడారం మినీ జాతర తేదీలు ఖరారు.. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు +నాలుగు రోజుల పాటు సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు

Select Suryaa Now
+మేడారం మినీ జాతర తేదీలు ఖరారు.. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు  +నాలుగు రోజుల పాటు సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు

ములుగు, మేజర్ న్యూస్ : తెలంగాణలోని ప్రసిద్ధ గిరిజన పుణ్యక్షేత్రం మేడారంలో నిర్వహించే శ్రీ సమ్మక్క–సారలమ్మ మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. తాడ్వాయి మండలం మేడారంలో 2027లో జరిగే మినీ జాతరను ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నారు.

మేడారం పూజారుల (వడ్డెలు) సంఘం సభ్యులు మినీ జాతర నిర్వహణ తేదీలను ఖరారు చేసి అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రికి లేఖ ద్వారా వివరాలను తెలియజేశారు.

జాతర తేదీలివే..

???? ఫిబ్రవరి 17, బుధవారం

???? ఫిబ్రవరి 18, గురువారం

???? ఫిబ్రవరి 19, శుక్రవారం

???? ఫిబ్రవరి 20, శనివారం

ఈ నాలుగు రోజుల పాటు మేడారంలో సమ్మక్క–సారలమ్మ అమ్మవార్ల ఉత్సవాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మేడారం తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉంది.

మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. ప్రధాన జాతర సంవత్సరానికి ఒకసారి జరిగే మహా ఉత్సవంగా గుర్తింపు పొందగా.. మధ్యలో జరిగే మినీ జాతరకు కూడా భక్తుల్లో విశేష ప్రాధాన్యం ఉంది.

మినీ జాతర తేదీలను పూజారుల సంఘం నాయకులు, వడ్డెలు ధ్రువీకరిస్తూ సంబంధిత లేఖపై సంతకాలు చేశారు. దీంతో 2027 మేడారం మినీ జాతర ఏర్పాట్లకు అధికారికంగా తేదీలు ఖరారైనట్లయింది.