BREAKING
మున్సిపల్ చైర్మన్ సీటు జనసేనకి ఇవ్వాలి తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్ల బుకింగ్‌లో భక్తులకు చేదు అనుభవం : శబరిమల టెండర్ వివరాలు లీక్.. 110 దుకాణాల ఈ-వేలం రద్దు.. త్వరలోనే రీ-టెండర్లు పిలవనున్న దేవస్వం బోర్డు +మేడారం మినీ జాతర తేదీలు ఖరారు.. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు +నాలుగు రోజుల పాటు సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు దేశీయ పర్యాటక రంగానికి సరికొత్త ఊతం.. ‘దేఖో అప్నా దేశ్ 2.0’ ప్రచారాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం చెన్నకేశవ స్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి పూజలు ప్రజలతో ఆప్యాయ పలకరింపులు ‎ ‎సామాన్యుడిలా బల్లపై కూర్చొని టీ తాగిన డిప్యూటీ సీఎం ‎ ‎ముదిగొండ టీ స్టాల్ వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముచ్చట్లు ‎ నేపాల్‌లోని హిమ్‌లుంగ్ బేస్ క్యాంప్‌లో హిమపాతం.. ఇద్దరి మృతదేహాలు వెలికితీత ‎కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లే పార్టీకి మూలస్తంభాలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ‎ ‎ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన ‎ ‎రూ. 10 లక్షలకు పెంచిన ఆరోగ్యశ్రీ పరిమితి ‎ ‎ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత అల్పాహారం, పాలు ‎ ‎నవంబర్ 19న ప్రతీ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా పథకం ‘ఇందిరమ్మ భీమా’ పూడిమడకలో ఉప్పుటేరును పరిశీలించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో మళ్లీ షట్‌డౌన్! ఎస్‌ఐఆర్‌’పై అనుమానాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలి నేడు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ నిరసనలు టీ పి సీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రోడ్డు ప్రమాదం పై శ్రీమరం పీఠాధిపతులు దిగ్భాంటి హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో అలరించిన చి. వేదాంశ కూచిపూడి నృత్య ప్రదర్శన భారత్‌ ఘనవిజయం.. వెస్టిండీస్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం రవీంద్రభారతిలో ఘనంగా 111వ జయంతి వేడుకలు – చేనేత, బీసీ సంక్షేమం, సామాజిక న్యాయంపై దృష్టి

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం రవీంద్రభారతిలో ఘనంగా 111వ జయంతి వేడుకలు – చేనేత, బీసీ సంక్షేమం, సామాజిక న్యాయంపై దృష్టి

Select Suryaa Now
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం  రవీంద్రభారతిలో ఘనంగా 111వ జయంతి వేడుకలు – చేనేత, బీసీ సంక్షేమం, సామాజిక న్యాయంపై దృష్టి

తెలంగాణ బ్యూరో ప్రతినిధి 
: తెలంగాణ ఉద్యమ నేత, స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు ఆదివారం హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో, కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల కమిటీ, తెలంగాణ పద్మశాలి కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాపూజీ జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధన, ప్రజా హక్కులు, సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా పలువురు స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. చేనేత కార్మికులు, నేతన్నల సంక్షేమంతో పాటు సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

గుజ్జ సత్యంకు ఘన సన్మానం

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకల నిర్వహణలో చీఫ్ అడ్వైజర్‌గా బాధ్యతలు నిర్వహించిన గుజ్జ సత్యంను తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్, తెలంగాణ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, తెలంగాణ చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూడము వెంకటరమణ ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా గుజ్జ సత్యం మాట్లాడుతూ.. బాపూజీ జయంతి రాష్ట్రస్థాయి వేడుకల్లో చీఫ్ అడ్వైజర్‌గా సేవలందించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, తెలంగాణ పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, తెలంగాణ చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూడము వెంకటరమణలకు కృతజ్ఞతలు తెలిపారు.

బాపూజీ ఆశయాలను కేవలం జయంతి వేడుకలకే పరిమితం చేయకుండా, చేనేత కుటుంబాల సంక్షేమం, బీసీల సామాజిక న్యాయం, యువతకు విద్య–ఉపాధి అవకాశాలు, బలహీన వర్గాల సాధికారత వంటి అంశాల్లో ఆచరణాత్మకంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

“బాపూజీని స్మరించుకోవడం అంటే కేవలం పూలమాల వేయడం కాదు.. ఆయన చూపిన సామాజిక న్యాయం, ప్రజా సేవ, ఆత్మగౌరవం, పోరాట స్ఫూర్తిని ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి” అని గుజ్జ సత్యం పేర్కొన్నారు.

బాపూజీ జీవిత చరిత్ర నేటి యువతకు స్ఫూర్తినిచ్చేలా ఉందని, ఆయన ఆశయాల సాధన కోసం అన్ని వర్గాలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

రవీంద్రభారతిలో జరిగిన ఈ రాష్ట్రస్థాయి వేడుకల్లో చేనేత, పద్మశాలి, బీసీ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.