BREAKING
చిరంజీవి అభిమానిలకు సత్కారం టమాటాలు ఎప్పటికీ తాజాగా, గట్టిగా ఉండాలా.. వంటింట్లో ఈ తప్పులు అస్సలు చేయకండి! తలనొప్పి వేధిస్తోందా.. ట్యాబ్లెట్లు వాడకుండానే ఇలా ఇట్టే తగ్గించుకోండి! కల్వర్టు పనులతో ఆర్టీసీ బస్సుల దారి మార్పు! వన్యప్రాణుల చర్మాల స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టు రెండు ప్రముఖ ఓటీటీలలో రోడీస్ రీబర్త్ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే? 2030 నాటికి రూ. 3.25 లక్షల కోట్లకు చేరనున్న భారత వినియోగదారు ఉత్పత్తుల మార్కెట్ ప్రజలే ప్రథమం… పరిష్కారమే పరమార్థం — పవన్ కళ్యాణ్ గారి బాటలో జనసేన!--కిషోర్ గునుకుల-జనసేన పండగ వేళ వినియోగదారులకు షాక్.. ఏసీలు, టీవీలు, గృహోపకరణాల ధరలు పెంపు సాంకేతిక సమస్యతో నిలిచిన పలు రైళ్లు.. డీజిల్‌ ఇంజిన్లతో కదిలిన శాతవాహన, పల్నాడు బిగ్ బాస్ హౌస్‌లో మనోజ్ తివారీ కూతురి ప్రవర్తనపై సల్మాన్ ఖాన్ తీవ్ర ఆగ్రహం డైరెక్టర్లకు నికర లాభంలో 1% కమిషన్ జొన్నవాడ ఆలయాన్ని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి సుబ్బారెడ్డి సెక్స్ కామెడీ సినిమాలలో అస్సలు నటించను.. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి స్పష్టత! వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ యస్.సుబ్బరెడ్డి దంపతులు

రాయచూరు మార్కెట్ యార్డును సందర్శించిన వికారాబాద్ మార్కెట్ కమిటీ

Select Suryaa Now
రాయచూరు మార్కెట్ యార్డును సందర్శించిన వికారాబాద్ మార్కెట్ కమిటీ


రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలపై అధ్యయనం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 27): తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ అనుమతితో నిర్వహిస్తున్న వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ స్టడీ టూర్‌లో భాగంగా కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డును వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్, పాలకవర్గ సభ్యులు సందర్శించారు.
ఈ సందర్భంగా రాయచూరు మార్కెట్ యార్డులో కొనసాగుతున్న వ్యవసాయ మార్కెట్ కార్యకలాపాలు, రైతులకు అందుతున్న సౌకర్యాలు, పంటల కొనుగోలు–అమ్మకాలు, మార్కెట్ నిర్వహణ విధానాలను కమిటీ సభ్యులు పరిశీలించారు. రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు కల్పించేందుకు అక్కడ చేపడుతున్న చర్యలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా మార్కెట్ కమిటీలు సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ పేర్కొన్నారు. రాయచూరు వ్యవసాయ మార్కెట్‌లో అమలు చేస్తున్న విధానాలను పరిశీలించడం ద్వారా వికారాబాద్ మార్కెట్ కమిటీ పరిధిలో రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడే అంశాలను తెలుసుకున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లేశం, డైరెక్టర్లు విజేందర్ రెడ్డి, ప్రభాకర్, పాపిరెడ్డి, నాగిరెడ్డి, రాజునాయక్, రమేష్ నాయక్, భీమయ్య, రంగారెడ్డి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.