BREAKING
ప్రకృతి వ్యవసాయంపై ఇండోనేషియా శాస్త్రవేత్తల బృందం పర్యటన పాలన మరిచి తిట్లతో కాలం గడుపుతున్న కాంగ్రెస్ నాయకులు కల్తీ భయం లేకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన కొబ్బరి నూనె తయారు చేసుకోండిలా.. టీడీపీలో చేరిన మంగళగిరి నియోజకవర్గ వైసీపీ నేతలు గీతాంజలి విద్యాలయం లో భగత్‌సింగ్ జయంతి వేడుకలు నేపాల్‌ను ముంచెత్తిన ప్రకృతి బీభత్సం టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు శ్రీ ప్రకాశం మున్సిపల్ హైస్కూల్‌లో చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు 28వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి అగ్గారపు శ్రీనివాసులు ఇంటింటి ప్రచారం అప్పుల బాధతో కూలీ ఆత్మహత్య యువత భవితకు భరోసా కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రమాదవశాత్తు కింద పడి వ్యక్తి మృతి మోడల్ సోలార్ విలేజ్ పోటీకి ఐదు గ్రామాలు మదర్ డెయిరీ డైరెక్టర్ గా చీర లావణ్య మహిపాల్ విజయం కూటమి పాలనతోనే రాష్ట్రానికి శ్రీరామరక్ష

డప్పు ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ సీమా సుల్తానా ఆర్థిక సాయం

Select Suryaa Now
డప్పు ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ సీమా సుల్తానా ఆర్థిక సాయం


రూ.5 వేల అందజేత.. ఎల్లమ్మ సేవలు చిరస్మరణీయమన్న సర్పంచ్
బషీరాబాద్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 27):మానవత్వంతో ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచారు మైల్వార్ గ్రామ సర్పంచ్ సీమా సుల్తానా అబ్దుల్ ఖాలిద్. గ్రామంలో ప్రభుత్వ కార్యక్రమాలు, ఇతర సమాచారాన్ని డప్పు చాటింపు ద్వారా ప్రజలకు చేరవేస్తూ సేవలందించిన డప్పు ఎల్లమ్మ ఇటీవల మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ సీమా సుల్తానా అబ్దుల్ ఖాలిద్, దివంగత ఎల్లమ్మ కుమారుడు, వార్డు సభ్యుడు డప్పు కాశీనాథ్ కుటుంబాన్ని పరామర్శించారు. ఎల్లమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తనవంతు సహాయంగా కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాల సమాచారాన్ని చేరవేయడంలో ఎల్లమ్మ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆమె మృతి గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి గ్రామ ప్రజలు అండగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తమ్మన్న, వార్డు సభ్యులు గోవింద్ రాథోడ్, మున్నూరు శమప్ప, ఇబ్రహీం, ఖలీల్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.రిపోర్టర్ కాశీం పాషా.