28వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి అగ్గారపు శ్రీనివాసులు ఇంటింటి ప్రచారం
ప్రొద్దుటూరు మేజర్ న్యూస్ :
ప్రొద్దుటూరు పట్టణంలోని ఆర్ట్స్ కాలేజీ రోడ్డు పరిధిలోని 28వ వార్డులో త్వరలో జరగనున్న మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అగ్గారపు శ్రీనివాసులు సోమవారం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులోని వివిధ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను, ఓటర్లను కలుసుకుంటూ తనకు మద్దతు తెలిపి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా అగ్గారపు శ్రీనివాసులు మాట్లాడుతూ 28వ వార్డులో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. వార్డులో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీ, రహదారులు తదితర సమస్యలపై ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రజల ఆశీస్సులతో తనను కౌన్సిలర్‌గా గెలిపిస్తే వార్డు అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజలను ఆత్మీయంగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని, ఎన్నికల్లో తనకు ఓటు వేసి ఆదరించాలని ఓటర్లను కోరారు. ప్రచారానికి స్థానికుల నుంచి మద్దతు లభించింది. ఈ కార్యక్రమంలో బెల్లాల గణేష్, బాబు, జమాల్ బాషా, మేడ సునీలు, గైబు భాష, బెల్లాల మురళి, వెంకట పుష్ప, హసన్ భాష తదితరులు పాల్గొని అగ్గారపు శ్రీనివాసులుకు మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు