BREAKING
ప్రొద్దుటూరులో కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య తహశీల్దార్ పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు హైదరాబాద్ లో 'బిల్ట్రస్ట్' గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ * రూ.450 కోట్ల పెట్టుబడి... కొత్తగా వేయి మందికి ఉద్యోగాలు * 2,600 మంది బీ2బీ సరఫరాదారులు, 14 మిలియన్ల కొనుగోలుదారులకు సేవలు * లాంఛనంగా ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పి.గన్నవరం టీడీపీ ఇన్‌చార్జిగా మోకా ఆనందసాగర్ నియామకం కీసరలో గంధమల్ల అజయ్ అదృశ్యంపై ఉత్కంఠ, 25 రోజులుగా జాడ లేదంటూ హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన కుటుంబం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కార్తిక్ జయంతి ‘రాయవలస’.. నవంబర్ 20న గ్రాండ్ రిలీజ్ విద్యార్థుల భవిష్యత్‌కు అండగా వై.వి. నాయుడు చారిటబుల్ ట్రస్ట్ 16 ఏళ్ల వయసులోనే ఇల్లు వదిలి.. కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి: శోభిత ధూళిపాళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు బాలల ఆరోగ్య వికాసం ఆల్బెండాజోల్ మాత్రాలతోనే : - పింఛనుదారులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో మెరిచిన జుహీ :- చలకుర్తి గ్రామ పెద్దలకు, పాలక మండలి సభ్యులకు మరియు మహిళా మాతాజీ లకు, ప్రత్యేకంగా యువకులకు విజ్ఞప్తి రాయప్రోలు మురళీ కృష్ణ శర్మ మహంకాళి ఆలయ ప్రహరీ గోడను ఢీకొట్టిన కారు గుర్తింపు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు అరెస్ట్. రూ.9 వేల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం. ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసుల చర్యలు యువతరానికి స్ఫూర్తి ప్రధాత భగత్ సింగ్

నరసాపురం–విశాఖ డైలీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలి

Select Suryaa Now
నరసాపురం–విశాఖ డైలీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలి

నరసాపురం–విశాఖ డైలీ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించాలి

భీమవరం, మేజర్ న్యూస్: నరసాపురం నుంచి విశాఖపట్నానికి డైలీ ఎక్స్‌ప్రెస్ రైలును పునరుద్ధరించాలని కోరుతూ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు వినతిపత్రం అందజేశారు. మంగళవారం భీమవరంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో రైల్వే ప్రయాణికుల సమస్యలను వివరిస్తూ మెమొరాండం సమర్పించారు.నరసాపురం, పాలకొల్లు, కోనసీమ ప్రాంతాల ప్రజలు విశాఖకు వెళ్లేందుకు నేరుగా డైలీ రైలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా వైద్య చికిత్స కోసం విశాఖలోని కేజీహెచ్‌, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులకు వెళ్లే రోగులు, విద్యార్థులు, వ్యాపారులు, ఆక్వా రైతులు, ఉద్యోగులకు ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.అలాగే భోగాపురం విమానాశ్రయం, అంతర్వేది, పాలకొల్లు క్షీరారామం, ద్రాక్షారామం, అన్నవరం, సింహాచలం, అరకు తదితర పర్యాటక, పుణ్యక్షేత్రాలకు రైలు అనుసంధానం కల్పించడం ద్వారా టూరిజం అభివృద్ధికి, రైల్వే ఆదాయం పెంపునకు దోహదపడుతుందని తెలిపారు. రైలును తక్షణమే డైలీ సర్వీసుగా పునరుద్ధరించాలని కోరారు.కార్యక్రమంలో సౌత్ కోస్ట్ రైల్వే డీఆర్‌యూసీసీ సభ్యుడు జక్కంపూడి కుమార్‌, కొల్లికొండ ప్రసాద్‌, కాశీరాజు, నాగరాజు, చిన్నబాబు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

 శ్రీనివాస్ భీమవరం