రెండో విడత దళితబంధు విడుదల చేయాలి
సూర్య వీణవంక: రెండో విడత దళితబంధు నిధులను వెంటనే విడుదల చేయడంతో పాటు, అర్హులైన పేదలకు చేయూత పింఛన్లు మంజూరు చేసి అందించాలని కోరుతూ మాజీ ఎంపీటీసీ జీడీ దేవేందర్ ప్రజావాణిలో దరఖాస్తు సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితబంధు రెండో విడత కోసం అర్హులైన లబ్ధిదారులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారని, నిధులు విడుదల కాకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు పథకం ప్రయోజనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.అదేవిధంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తదితర అర్హులైన పేదలకు చేయూత పింఛన్లు మంజూరు చేసి సకాలంలో అందించాలని ప్రజావాణిలో అధికారులను కోరినట్లు జీడీ దేవేందర్ తెలిపారు. అర్హులైన ఒక్క కుటుంబం కూడా సంక్షేమ పథకాలకు దూరం కాకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రెండో విడత దళితబంధు నిధుల విడుదల అంశంపై గతంలోనూ లబ్ధిదారులు ప్రజావాణిలో వినతులు సమర్పించిన సందర్భాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలోనలుబాల రాజేష్ మారముర్ల రమేష్
వంతడుపుల శేఖర్ రాచపల్లి అంజి మారముల కుమార్ తదితరులు పాల్గొన్నారు