న్యాయవాది అశ్వినికి గ్రామస్తుల ఘన సన్మానం
సూర్య బెజ్జుర్:కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాబెజ్జుర్ మండలం లంబినగర్ నిరుపేద కుటుంబానికి చెందిన అశ్విని పేదరికం చదువుకు అడ్డుకాదని, పట్టుదలతో కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని లంబిని నగర్ గ్రామానికి చెందిన అశ్విని నిరూపించింది. కూలి నాలి చేస్తూ ఎన్నో కష్టాలు ఎదుర్కొని తమ కుమార్తెను ఉన్నత చదువులు చదివించిన తల్లిదండ్రులు బేడికే జనార్దన్, విమల దంపతుల కలను నిజం చేస్తూ అశ్విని తెలంగాణ స్టేట్ బార్ ద్వారా న్యాయవాదిగాప్రమాణ ము చేసింది, చాలా సంతోషంగా ఉందని అన్నరు.మారుమూల గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన అశ్విని చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి కనబరిచింది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తల్లిదండ్రులు వెనుకడుగు వేయకుండా కూలి పనులు చేస్తూ కుమార్తె చదువుకు అండగా నిలిచారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించిన అశ్విని పట్టుదలతో విద్యనభ్యసించి తెలంగాణబార్ ద్వారా న్యాయవాదిగా తన లక్ష్యాన్ని చేరుకుంది.గ్రామానికి చెందిన ఆడబిడ్డ ఉన్నత స్థాయికి చేరుకోవడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ అశ్వినిని ఘనంగా సన్మానించి అభినందించారు. తల్లిదండ్రుల కష్టానికి తగిన ఫలితం దక్కిందని, అశ్విని సాధించిన విజయం గ్రామానికే గర్వకారణమని కొనియాడారు.ఈ సందర్భంగా అశ్విని మాట్లాడుతూ.. తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివినా ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని తెలిపింది. ప్రైవేటు పాఠశాలలే గొప్పవని భావించకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు పిలుపునిచ్చింది.విద్యార్థులందరూ చదువుపై దృష్టి సారించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని, కుటుంబానికి, గ్రామానికి మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని కోరింది. అశ్విని విజయం మారుమూల గ్రామీణ ప్రాంతాలలోనిపేద విద్యార్థులకు స్ఫూర్తి దయాకంగా నిలుస్తుంది.