BREAKING
నూతన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్‌కు బొలిశెట్టి సత్య అభినందనలు.... థాయ్‌లాండ్‌లో ప్రతిపక్ష ఎంపీకి భారీ ఊరట దక్షిణ కొరియా కేబినెట్‌లో కీలక మార్పులు ఉక్రెయిన్‌లోని కీవ్ ప్రాంతంలో రష్యా భీకర దాడి మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా వాసంశెట్టి వెంకటరమణారావు ఢిల్లీ వైపు సాగుతున్న భారత్-శ్రీలంక సైక్లింగ్ యాత్ర శ్రీ సత్య సాయి బాబా మహా సమాధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి ఐక్యతతో పోరాడితేనే హార్డ్వేర్ పార్క్ భూ సమస్యకు పరిష్కారం జెలెన్స్కీపై రష్యా హత్యాయత్న కుట్రను భగ్నం చేసిన పోలాండ్ నిఘా వర్గాలు... ప్రభుత్వ భూములు అమ్మొద్దు - ఎంపీ ఆర్. కృష్ణయ్య శ్రీ సత్యసాయి మహా సమాజం దర్శించుకున్న కేరళ ముఖ్యమంత్రి వివోఏ లకు కనీస వేతనం ప్రకటించాలి ప్రభుత్వరంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్ర.. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం: ప్రొఫెసర్‌ హరగోపాల్‌ బెల్గాం ఎయిర్‌పోర్ట్ మూసివేత అలర్ట్: కమ్యూనిస్టుల ఐక్యతతోనే ప్రజా సమస్యలకు పరిష్కారం.: సినీ నటుడు మాదాల రవి

ప్రభుత్వ భూములు అమ్మొద్దు - ఎంపీ ఆర్. కృష్ణయ్య

Select Suryaa Now
ప్రభుత్వ భూములు అమ్మొద్దు     - ఎంపీ ఆర్. కృష్ణయ్య
ముషీరాబాద్, మేజర్ న్యూస్ :ప్రభుత్వ భూములను విక్రయించకుండా పేదలు, విద్యార్థుల సంక్షేమానికి వినియోగించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. మియాపూర్‌లోని 850 ఎకరాల భూములను అమ్మకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించేందుకు కేటాయించాలని కోరారు. సోషలిస్టు విద్యార్థి సంఘం మహేష్ ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్క్  ధర్నా చౌక్ లో  వందలాది మంది విద్యార్థులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 325 బీసీ హాస్టళ్లు, 320 బీసీ గురుకులాలు, 50 ఎస్సీ గురుకులాలకు సొంత భవనాలు లేకపోవడం విచారకరమన్నారు. అద్దె భవనాల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఐదుగురు ఉండాల్సిన గదుల్లో 20 నుంచి 30 మంది ఉంటున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సౌకర్యాలు, ఆరోగ్యంపై దృష్టి పెట్టకుండా అద్దె భవనాల్లో నిర్వహించడం వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ భూములను హాస్టళ్లు, గురుకులాలు, పేదల ఇళ్ల నిర్మాణాలకు వినియోగించాలని, అదనంగా150 బీసీ కాలేజీ హాస్టళ్లు,100 బీసీ గురుకులాలు మంజూరు చేయాలని కోరారు. హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వం 80 శాతం గ్రాంటు అందించే అవకాశం ఉందని, కార్పొరేట్ సంస్థల సీఎస్ఆర్ నిధులను కూడా వినియోగించాలని సూచించారు. కాలేజీ హాస్టల్ విద్యార్థులకు నెలవారీ పాకెట్ మనీగా బాలికలకు రూ.1,000, బాలురకు రూ.800 ఇవ్వాలన్నారు.
ప్రతి హాస్టల్‌కు అదనంగా ఇద్దరు వర్కర్లను నియమించాలన్నారు.100 మందికి మించి విద్యార్థులుంటే ప్రతి 25 మందికి ఒక వర్కర్‌ను పెంచాలన్నారు.
ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, పీజీ, డిగ్రీ, ఇంటర్ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అదనంగా150 బీసీ కాలేజీ హాస్టళ్లు మంజూరు చేయాలన్నారు.
240 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయాలన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో  జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, సి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు అనంతయ్య, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి.  రాజేందర్, నరేష్ గౌడ్, శివ ముదిరాజు, భీమయ్య తదితరులు పాల్గొన్నారు.