telangana
నాణ్యమైన ఆహారంతో ప్రజల ఆదరణ పొందాలి : శంభీపూర్ క్రిష్ణ
దుండిగల్ మేజర్ న్యూస్ ప్రజల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన ఆహారం అందించాలని శంభీపూర్ క్రిష్ణ అన్నారు. ఆదివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ భౌరంపేట్ డివిజన్‌లోని లహరి గ్రీన్ పార్క్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ది బాక్స్ కేఫ్, ఏవియన్ అడ్డా డీపీఆర్ ఫుడ్ కోర్ట్‌లను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శంభీపూర్ క్రిష్ణ మాట్లాడుతూ ఆహార నాణ్యత, రుచితో పాటు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. నూతనంగా ప్రారంభించిన ఫుడ్ కోర్ట్‌లు ప్రజల ఆదరణ పొందుతూ దినదినాభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ప్రాంతంలో యువత, కుటుంబాలు, స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండేలా ఫుడ్ కోర్ట్‌లను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వ్యాపార రంగంలో నిర్వాహకులు మరింతగా రాణించి మంచి గుర్తింపు పొందాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ మిద్దెల బాల్‌రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్లు బెంబడి బుచ్చిరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు శ్యామ్, బాబీ, వంశీ, బిక్షపతి, శ్రీశైలం యాదవ్, మల్లేష్, సుంకరి వినోద్, ఫుడ్ కోర్ట్ నిర్వాహకులు శేఖర్, విష్ణు, కాలనీ సభ్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు