BREAKING
నూతన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్‌కు బొలిశెట్టి సత్య అభినందనలు.... థాయ్‌లాండ్‌లో ప్రతిపక్ష ఎంపీకి భారీ ఊరట దక్షిణ కొరియా కేబినెట్‌లో కీలక మార్పులు ఉక్రెయిన్‌లోని కీవ్ ప్రాంతంలో రష్యా భీకర దాడి మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా వాసంశెట్టి వెంకటరమణారావు ఢిల్లీ వైపు సాగుతున్న భారత్-శ్రీలంక సైక్లింగ్ యాత్ర శ్రీ సత్య సాయి బాబా మహా సమాధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి ఐక్యతతో పోరాడితేనే హార్డ్వేర్ పార్క్ భూ సమస్యకు పరిష్కారం జెలెన్స్కీపై రష్యా హత్యాయత్న కుట్రను భగ్నం చేసిన పోలాండ్ నిఘా వర్గాలు... ప్రభుత్వ భూములు అమ్మొద్దు - ఎంపీ ఆర్. కృష్ణయ్య శ్రీ సత్యసాయి మహా సమాజం దర్శించుకున్న కేరళ ముఖ్యమంత్రి వివోఏ లకు కనీస వేతనం ప్రకటించాలి ప్రభుత్వరంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్ర.. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం: ప్రొఫెసర్‌ హరగోపాల్‌ బెల్గాం ఎయిర్‌పోర్ట్ మూసివేత అలర్ట్: కమ్యూనిస్టుల ఐక్యతతోనే ప్రజా సమస్యలకు పరిష్కారం.: సినీ నటుడు మాదాల రవి

ఐక్యతతో పోరాడితేనే హార్డ్వేర్ పార్క్ భూ సమస్యకు పరిష్కారం

Select Suryaa Now
ఐక్యతతో పోరాడితేనే హార్డ్వేర్ పార్క్ భూ సమస్యకు పరిష్కారం
హిమాయత్ నగర్, మేజర్ న్యూస్ బాధితులంతా ఐక్యతతో పోరాడితేనే హార్డ్వేర్ పార్కు భూ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈ మేరకు ఆదివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో హార్డ్వేర్ పార్క్ భూసేకరణ బాధితుల సమావేశం నిర్వహించారు. అభినందన హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ హార్డ్వేర్ పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి శాసనమండలి సభ్యులు టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటి నరసింహ తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి రమేష్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల ఎం ఎం కుంట నాదర్గుల్ గ్రామాల పరిధిలో హార్డ్వేర్ పార్క్ భూసేకరణతో ఏర్పడిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. గతంలో అధికారులను కలిసినప్పుడు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా, మరోసారి సమావేశమవుదామని వాయిదాలు వేస్తూ వచ్చారని అన్నారు. అయితే, ప్రస్తుతం భూములకు సంబంధించిన పూర్తి సమాచారం, అన్ని పత్రాలు సేకరించామని, భూముల విస్తీర్ణం, ప్రస్తుత పరిస్థితి, న్యాయపరమైన అంశాలపై స్పష్టమైన వివరాలు మన చేతిలో ఉన్నాయని తెలిపారు. ఈ సమాచారంతో ప్రభుత్వాన్ని నిర్దిష్టంగా ప్రశ్నించి, సమస్య పరిష్కారం కోసం గట్టిగా నిలబడే అవకాశం ఏర్పడిందన్నారు. పూర్తి వివరాలతో కూడిన లేఖను ఎంపీ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటూ, వారితో కలిసి పోరాడుతామని స్పష్టం చేశారు. సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్న బాధితులు నిరాశ చెందకుండా ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య మాట్లాడుతూ  ప్రజల నివాస, ఆస్తి హక్కులను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే విధంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. 
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇ.టి. నరసింహ మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరిగే వరకు సీపీఐ పార్టీ వారి పక్షాన నిలబడి పోరాటానికి మద్దతుగా ఉంటుందని తెలిపారు.2004లో హార్డ్‌వేర్ పార్క్, వర్క్ సెంటర్ పేరుతో చేపట్టిన భూసేకరణలో భాగంగా సుమారు 5,000 ఎకరాలకు సంబంధించి 28 నోటిఫికేషన్లు జారీ చేశారు. అయితే, నష్టపరిహారం చెల్లించని అనేక భూములను కూడా టి జి ఐ సి సి పేరుతో రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసి నిషేధిత జాబితాలో చేర్చారు. ఈ భూసేకరణను సవాలు చేస్తూ రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించగా, ఆదిభట్లలోని సర్వే నంబర్లు 46 నుంచి 53 వరకు జారీ చేసిన నోటిఫికేషన్లను హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలును సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది.ఇదే పరిధిలోని సర్వే నంబర్ 67లో ఉన్న అభినందన హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీకి చెందిన 245 ప్లాట్ల చుట్టూ ఇటీవల టీజీఐసీసీ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, నష్టపరిహారం చెల్లించకుండా ప్రహరీ గోడ నిర్మించడంతో వివాదం ఏర్పడింది. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో బాధితులు ఆందోళన చేపట్టారు. తమ జీవితకాల సంపాదనతో ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం చేయాలని, సుమారు 20,000 ప్లాట్ల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో బాధితుల భూములను భూసేకరణ నోటిఫికేషన్ల నుంచి మినహాయించి, నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, అభినందన హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ ఆధీనంలోని భూముల నుంచి టీజీఐసీసీ అధికారులు తక్షణమే వైదొలగాలని డిమాండ్ చేశారు. భూసేకరణకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించి రైతులు, ప్లాట్ల యజమానులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ సమావేశంలో హార్డ్‌వేర్ పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్, హైకోర్టు న్యాయవాది మాధవరం రామేశ్వర్ రావు, టి.జే.ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, జేఏసీ కన్వీనర్ దార సత్యం, అభినందన హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు గండూరి భాస్కర్, ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.ఆర్.కె. నరేంద్ర, బాధితులు తదితరులు పాల్గొన్నారు.