శ్రీ సత్య సాయి బాబా మహా సమాధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి
ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి శ్రీ సత్య సాయిబాబా మహా సమాధిని దర్శించుకున్నారు. శ్రీ సత్యసాయి బాబా జయంతి వేడుకలకు విచ్చేసిన కేంద్ర మంత్రి శ్రీ సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకున్న అనంతరం హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన జయంతి వేడుకలలో పాల్గొన్నారు.